
ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం
మణుగూరురూరల్: ఎస్సీ వర్గీకరణలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాలమహానాడు జాతీయ నాయకులు బి.చెన్నయ్య అన్నారు. ఆదివారం మండలంలోని సమితిసింగారం గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన మాలమహానాడు సంఘం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వర్గీకరణలో ఐదుశాతం మాలలకు, తొమ్మిది శాతం మాదిగలకు కేటాయిస్తూ ప్రభుత్వం వర్గీకరణ చేపట్టి మాలల ఉనికే ప్రశ్నార్థకమయ్యేలా వ్యవహరించిందన్నారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునఃసమీక్షించి జీఓ–99ను సవరించాలని డిమాండ్ చేశారు. మాలల హక్కులను కాపాడుకునేందుకు నవంబర్ 2వ తేదీన చలో హైదరాబాద్, మాలల రణభేరి మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బూర్గుల వెంకటేశ్వర్లు, పప్పుల జాన్, రంజిత్‌కుమార్, శివకుమార్, నవతన్, బూర్గుల విజయ్‌కుమార్, సుష్మ, మద్దెల భద్రయ్య, వేర్పుల నరేశ్, బూర్గుల సతీశ్, చింతమల్ల రమేశ్, దాసరి వెంకట్, వేర్పుల సురేశ్, బూర్గుల సంజీవరావు, ముల్క నరేశ్, ఏసురత్నం, ప్రసాద్, రవి, బాబీ తదితరులు పాల్గొన్నారు.