
కిన్నెరసాని గేటు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలయాశానికి వరద కొనసాగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 5 వేల క్యూసెక్కుల వరద రావడంతో ఆదివారం నీటిమట్టం 406.10 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు.
సండే సందడి
కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 607 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.32,475 ఆదాయం లభించింది. 300 మంది బోటుషికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.18,350 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.