10 శాతం జీఎస్‌టీ?ఇక డీజిల్‌ కార్లకు చెక్‌? నితిన్‌ గడ్కరీ క్లారిటీ | 10 pc tax End of diesel cars in India check Nitin Gadkari clarifies | Sakshi
Sakshi News home page

10 శాతం జీఎస్‌టీ? ఇక డీజిల్‌ కార్లకు చెక్‌? నితిన్‌ గడ్కరీ క్లారిటీ

Published Tue, Sep 12 2023 2:52 PM | Last Updated on Tue, Sep 12 2023 3:11 PM

10 pc tax End of diesel cars in India check Nitin Gadkari clarifies - Sakshi

10% GST on the sale of diesel vehicles: పొల్యూషన్‌కు చెక్‌ పెట్టేలా డీజిల్ ఇంజన్ల వాహనాల కొనుగోలుపై 10 శాతం అదనపు జీఎస్‌టీ  బాదుడుకు కేంద్రం సిద్ధమవుతోందన్న వార్తలు కలకలం రేపాయి. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ  సూచన మేరకు ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇక డీజిల్‌ వాహనాలకు కాలం చెల్లినట్టే అన్న ఊహాగానాలు మార్కెట్లో వ్యాపించాయి. దీంతో స్టాక్‌మార్కెట్లో ఆటో, చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా తీవ్ర నష్టాలను చవి చూశాయి. 

అయితే దీనిపై తక్షణమే  స్పందించిన రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ  వార్తలు అవాస్తవాలు అంటూ ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి 'యాక్టివ్ పరిశీలన'లో లో లేదని స్పష్టం చేశారు. అయితే  2070 నాటికి కార్బన్  ఉద్గరాలను పూర్తిగా నిరోధించాలన్న లక్ష్యానికి  అనుగుణంగా డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల ఏర్పడే వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడంతోపాటు ఆటోమొబైల్ విక్రయాలు వేగంగా పెరుగుతుండటంతో క్లీనర్ , గ్రీన్ ఆల్టర్నేటివ్ ఇంధనాలను చురుకుగా స్వీకరించడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ ఇంధనాలు దిగుమతి ప్రత్యామ్నాయాలుగా, ఖర్చుతో కూడుకున్నవి కాకుండా దేశీయమైనవి , కాలుష్య రహితంగా ఉండాలని సూచించారు. పర్యావరణహితమైన వాహనాల ఉత్పత్తిపై కంపెనీలు దృష్టి సారించాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement