అతి తక్కువ కాలంలో భారీగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారా? అయితే, మీకు అధిక రాబడులు ఇచ్చే ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే స్టాక్ మార్కెట్. ఇందులోకి కాలం కలిసి రావాలి గాని అనతి కాలంలోనే భారీ లాభం పొందొచ్చు. అయితే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టాలి అనుకున్న స్టాక్ గురుంచి చాలా కాలం రీసెర్చ్ చేశాకే పెట్టుబడులు పెట్టాలి. లేకపోతే షేర్ మార్కెట్‌లో డబ్బులు పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, భారీ లాభంతో పాటు భారీ నష్టాలు కూడా వస్తాయి. ఒక్కోసారి పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
అయితే, మరికొన్ని మాత్రం మదుపరులు ఊహించని రీతిలో రాబడులు ఇస్తాయి. వాటినే మల్టీబ్యాగర్ స్టాక్ అంటారు. ఇప్పుడు అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ అదానీ టోటల్ గ్యాస్ మదుపరులకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర మూడు ఏళ్లలోనే 2000 శాతం పెరిగింది. అంటే, మూడు ఏళ్ల క్రితం రూ.10 వేలు విలువ గల అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర కొని ఉంటే నేడు ఆ షేర్ విలువ రూ.2 లక్షలకు పైగా మారేది. అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర గత ఏడాది కాలంగా భారీగా పెరుగుతుంది. 2018 నవంబర్ 9న రూ.80 ఉన్న షేర్ ధర నేడు(నవంబర్ 25) రూ.1,658.00గా ఉంది.
(చదవండి: వామ్మో! రియల్ స్క్విడ్ గేమ్ ప్రైజ్ మనీ ఇన్ని కోట్లా?)
Comments
Please login to add a commentAdd a comment