
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రిటైల్ బిజినెస్, ఆపరేషన్స్ ఎండీగా అలోక్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన ఎస్‌బీఐ ఫైనాన్స్ విభాగం డిప్యూటీ ఎండీగా పనిచేశారు. మానవ వనరుల విభాగం డిప్యూటీ ఎండీ, కార్పొరేట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గానూ గతంలో విధులు నిర్వర్తించారు. ఢిల్లీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా దినేష్ ఖరా వ్యవహరిస్తున్నారు. అలోక్ చౌదరితోపాటు ఎండీలుగా సి.ఎస్.శెట్టి, జె.స్వామినాథన్, అశ్విని కుమార్ తివారి ఉన్నారు.