![AM Green Acquires Chempolis Next-Gen 2G Bio Fuel Technology](/styles/webp/s3/article_images/2024/09/23/am-green.jpg.webp?itok=l01e1tmu)
ఏఎం గ్రీన్ గ్రూప్‌లో భాగమైన.. ఏఎం గ్రీన్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ బీ.వీ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఎనర్జీ ట్రాన్సిషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటైన చెంపోలిస్ ఓయ్ (Chempolis Oy)తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఏఎం గ్రీన్ ఏర్పరచుకున్న ఈ భాగస్వామ్యం ద్వారా.. నెక్స్ట్ జెన్ 2జీ బయో ఫ్యూయెల్ టెక్నాలజీతో భారీ స్థాయి బయో రిఫైనరీలను ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా పారిశ్రామిక రంగాలలో ఉపయోగించే గ్రీన్ కెమికల్స్ వంటి వాటితోపాటు ఇథనాల్, ఫర్‌ఫ్యూరల్, ప్యూర్ లిగ్నిన్ వంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేయనుంది. మొత్తం మీద ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్లాట్‌ఫారమ్‌గా ఏఎం గ్రీన్ ఎదగటానికి సర్వత్రా సిద్ధమవుతోంది. దీనికోసం కంపెనీ రాబోయే మూడేళ్లలో సుమారు 1 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది.
2జీ లిగ్నో-సెల్యులోసిక్ ఫీడ్‌స్టాక్‌ల ప్రాసెసింగ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చెంపోలిస్‌తో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నామని ఏఎం గ్రూప్ చైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' అన్నారు. ఈ భాగస్వామ్యం పారిశ్రామిక రంగాలలో గ్లోబల్ డీకార్బనైజేషన్‌ను ఎనేబుల్ చేయడంలో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
ఏఎం గ్రీన్ గ్రూప్ గురించి
ఏఎం గ్రీన్ గ్రూప్ అనేది హైదరాబాద్‌కు చెందిన సంస్థ. దీనిని అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ప్రారంభించారు. ఇది భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ ట్రాన్సిషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి వాటి ఉత్పత్తులలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment