కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్‌పై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అతి తక్కువ సమయంలో 2022-23 బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ ప్రసంగం అత్యంత ప్రభావవంతమైనది అని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. మహీంద్రా గ్రూప్ చైర్ పర్సన్ ట్వీట్ చేస్తూ.. "సంక్షిప్తత ఎల్లప్పుడూ ఒక సుగుణం. నిర్మలా సీతారామన్ అతి తక్కువ సమయంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అత్యంత ప్రభావవంతమైనదిగా మారవచ్చు" అని అన్నారు.
2020లో బడ్జెట్ ప్రవేశ పెట్టె సమయంలో ఆమె రెండు గంటల 40 నిమిషాలు మాట్లాడింది. ఆమె ఉదయం 11 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి ఇంకా బడ్జెట్‌కు సంబంధించిన రెండు పేజీలు ఉండగానే ఆమె మధ్యాహ్నం 1:40 గంటలకు ముగించింది. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ తన కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని కేవలం ఒక గంట 30 నిమిషాల్లో పూర్తి చేశారు. ఇది అన్నీ సంవత్సరాల్లో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం. 2021లో ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని ఒక గంట 40 నిమిషాల్లో ముగించారు. ప్రస్తుత సంవత్సరం కంటే 2022-23 ఆర్ధిక సంవత్సరానికి మూలధన వ్యయం రూ.5,40,000 కోట్లకు (35 శాతం) పెరిగింది. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం 10.68 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.
Brevity has always been a virtue. @nsitharaman ‘s shortest budget address may prove to be the most impactful…
— anand mahindra (@anandmahindra) February 1, 2022
Comments
Please login to add a commentAdd a comment