భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్ | Anand Mahindra Share Electric Flying Taxi | Sakshi
Sakshi News home page

భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్

Published Sat, May 11 2024 9:54 PM | Last Updated on Sun, May 12 2024 7:26 AM

Anand Mahindra Share Electric Flying Taxi

గత కొన్ని సంవత్సరాలు ఎగిరే కార్లు వస్తాయని వింటూనే ఉన్నాము. ఇటీవల ఆనంద్ మహీంద్రా దేశంలో అడుగు పెట్టనున్న మొదటి ఎలక్ట్రిక్ ట్యాక్సీను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎప్లాన్ (Eplane) అనే స్టార్టప్ కంపెనీ ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీని అభివృద్ధి చేసింది. దీనికి గత సంవత్సరమే ఏవియేషన్ సెక్టార్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ విమానాల తయారు చేసే కంపెనీగా అవతరిస్తుంది.

ఈ కంపెనీకి చెందిన ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేస్తూ.. వచ్చే ఏడాది లోపల మద్రాస్ ఐఐటీ ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement