అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. రాధిక గురించి ఆసక్తికర విషయాలు.. | Anant Ambani and Radhika Pre wedding celebrations. Here is all you should know about Radhika Merchant - Sakshi
Sakshi News home page

అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. రాధిక గురించి ఆసక్తికర విషయాలు..

Published Tue, Mar 5 2024 11:46 AM | Last Updated on Tue, Mar 5 2024 12:14 PM

Anant Amabani Radhika Marchent Wedding Celebrations - Sakshi

అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి వేడుకల గురించి ప్రస్తుతం దేశంఅంతా చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్‌ తారలు ప్రివెడ్డింగ్‌ ఈవెంట్‌లో సందడి చేశారు. ఆటపాటలతో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుక అందిరికీ గుర్తుండిపోయేలే జరిగింది.

ముందస్తు పెళ్లి వేడుకలే ఈ రేంజ్‌లో ఉంటే ఇక పెళ్లి ఏరేంజ్‌లో ఉంటుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడిగా అనంత్‌ అంబానీ గురించి దాదాపు చాలామందికే తెలుసు. పనిలోపనిగా అంబానీల ఇంటికొస్తున్న చిన్న కోడలెవరోనని చాలామంది ఆరాతీస్తున్నారు.

ఇషా అంబానీ-ఆనంద్‌ పిరమల్‌ల వివాహం 2018లోనే జరిగింది. ఆ సమయంలోనే రాధిక మర్చంట్‌ పేరు వినిపించింది. 2019లో ఆకాశ్‌-శ్లోకల పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం, ప్రతీ వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, సంగీత్‌ వేడుకలో అనంత్‌కు జంటగా డ్యాన్స్‌ చేయడంతో నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలంటూ ప్రచారం ఊపందుకుంది. 

ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ సీఈఓ వీరెన్‌ మర్చంట్‌-శైలజా మర్చంట్‌ల కుమార్తె రాధిక. తండ్రి వీరెన్‌ మర్చంట్‌ హెల్త్‌కేర్‌ సీఈఓగా, వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

రాధిక న్యూయార్క్‌ యూనివర్సిటీలో పాలిటిక్స్‌, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేశాక ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా కొన్నాళ్లు పనిచేశారు. ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సంస్థలో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్‌ భావనా థాకర్‌ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు.

ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో 2022లో ముకేశ్‌-నీతా అంబానీలు రాధికకు అరంగేట్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముకేశ్‌ భార్య నీతా అంబానీ కూడా క్లాసికల్‌ డ్యాన్సర్‌. దీంతో అత్తకు తగ్గ కోడలు అని అందరూ ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement