లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్‌! | Anant Ambani Radhika Went For Shopping To Dubai With Tight Security | Sakshi
Sakshi News home page

Anant-Radhika Wedding: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్‌!

Published Tue, Apr 9 2024 10:21 AM | Last Updated on Tue, Apr 9 2024 1:24 PM

Anant Ambani Radhika Went For Shopping To Dubai With Tight Security - Sakshi

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధికమర్చంట్‌ల ప్రీవెడ్డింగ్‌ వేడుక ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న ఆ జంట తాజాగా దుబాయ్‌లో షాపింగ్‌ చేస్తూ కనిపించింది. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారేమో.. సంపన్నుల షాపింగ్‌ అంటే భారీ బందోబస్తుతో వెళతారు. అనంత్‌-రాధికలు కూడా భారీ సెక్యూరిటీ మధ్య లగ్జరీ కార్లతో దుబాయ్‌లోని విలాసవంతమైన సిటీ వాక్ మాల్‌లో ప్రత్యక్షమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అనంత్‌-రాధికల జంట దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే రోల్స్‌రాయిస్‌ కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ మోడల్‌కారులో మాల్‌లోకి ప్రవేశించారు. వారిచుట్టూ భారీ సెక్యూరిటీ ఉన్నట్లు వీడియో ద్వారా తెలిసింది. దాంతోపాటు లగ్జరీ కార్లతో సెక్యూరిటీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాన్వాయ్‌లో కాడిలాక్ ఎస్కలేడ్స్, జీఎంసీ యుకోన్ డెనాలిస్, చేవ్రొలెట్ సబర్బన్‌తోపాటు ఓ అంబులెన్స్ కూడా  ఉంది. చివరకు వారు షాపింగ్‌ చేసిన లగేజీ తెచ్చుకోవడానికి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆ కార్ల కాన్వాయ్‌ను వినియోగించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనంత్‌ రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 2024 జులైలో అనంత్‌-రాధిక వివాహం చేసుకోనున్నారు.

ఇదీ చదవండి: రికార్డులను తిరగరాస్తున్న బంగారం ధరలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement