ఏడేళ్ల క్రితం రైతు సాధికార సంస్థ (RySS) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF), పోర్చుగల్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 గెలుచుకుంది.
పర్యావరణ వ్యవస్థ రక్షణకు దోహదపడే వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందిస్తారు. ఈ అవార్డు కింద ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఒక మిలియన్ యూరోల ప్రైజ్ మనీ లభించింది. దీనిని ఏపీసీఎన్ఎఫ్ మాత్రమే కాకుండా సాయిల్ సైంటిస్ట్ రతన్ లాల్, ఈజిప్ట్‌కు చెందిన సెకెమ్ పంచుకున్నారు.
మాజీ జర్మన్ ఛాన్సలర్ అండ్ సీజీఎఫ్ జ్యూరీ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ ఏంజెలా మార్కెల్ అధ్యక్షతన ఉన్న జ్యూరీ 117 దేశాల నుంచి వచ్చిన మొత్తం నామినేషన్లలో ముగ్గురు గ్రహీతలను ఎంపిక చేసింది. ఇందులో ఏపీసీఎన్ఎఫ్ కూడా ఒకటి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment