Apple May Discontinue iPhone 11 in 2022- Sakshi
Sakshi News home page

iPhone 11: యాపిల్‌ సంచలన నిర్ణయం.. వాటిని పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధం..!

Published Tue, Apr 19 2022 11:26 AM | Last Updated on Tue, Apr 19 2022 11:47 AM

Apple May Discontinue iPhone 11 in 2022 for This Reason - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం యాపిల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్‌-14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను యాపిల్‌ లాంచ్‌ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు యాపిల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

iDropNews నివేదిక ప్రకారం...ఐఫోన్‌-11 స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఐఫోన్‌ ఎస్‌ఈ 3తో నేరుగా పోటీపడటంతో...ఈ సంవత్సరం నుంచి దశలవారీగా ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్‌ సిద్దమైన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఐఫోన్‌-11, ఐఫోన్‌ ఎస్‌ఈ 3 స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా సరిసమానంగా  ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్‌-11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్‌ సన్నాహాలను చేస్తోంది. ఇదిలా ఉండగా ఐఫోన్‌-12 ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐఫోన్‌-12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలు ఐఫోన్‌-11 ధరలతో సమానంగా ఉండే ఆస్కారం ఉందని ఐడ్రాప్‌ న్యూస్‌ తన నివేదికలో పేర్కొంది. 

చదవండి: యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తక్కువ ధరలోనే...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement