
ప్రపంచ దేశాలను పీడిస్తున్న కోవిడ్-19 కట్టడికి వీలుగా వ్యాక్సిన్ తయారీ కోసం అమెరికన్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌తో హెల్త్‌కేర్ రంగ దక్షిణాఫ్రికా కంపెనీ యాస్పెన్ ఫార్మాకేర్ చేతులు కలిపింది. ఇందుకు జేఅండ్‌జేతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాస్పెన్ హెల్త్‌కేర్ తాజాగా వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కు దక్షిణాఫ్రికాతోపాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు అనుమతి లభిస్తే.. తయారీని చేపట్టనున్నట్లు యాస్పెన్ ఫార్మాకేర్ పేర్కొంది. ప్రస్తుతం జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ తగినంత ప్రభావం చూపడంతోపాటు భద్రతా ప్రమాణాలను అందుకుంటే తయారీని చేపట్టే వీలున్నట్లు వివరించింది. ఇందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఆమోదముద్ర వేయవలసి ఉంటుందని తెలియజేసింది. తద్వారా పోర్ట్‌ఎలిజెబెత్‌లోగల ప్లాంటు ద్వారా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయనున్నట్లు పేర్కొంది.
ట్రయల్స్‌లో..
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం పరీక్షల స్థాయిలో ఉన్న నాలుగు విభిన్న వ్యాక్సిన్లలో జేఅండ్‌జే రూపొందించిన ఏడీ26.సీవోవీ3-ఎస్ ఒకటని యాస్పెన్ తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే భారీ స్థాయిలో జేఅండ్‌జే సరఫరా చేయవలసి ఉంటుందని, వీటిని ఇండివిడ్యుయల్ డోసేజీలలో తాము రూపొందిస్తామని వివరించింది. దక్షిణాఫ్రికా ప్లాంటుపై 18.4 కోట్ల డాలర్లను(సుమారు రూ. 1,360 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు యాస్పెన్ సీఈవో స్టీఫెన్ సాద్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్లాంటు నుంచి ఇప్పటికే హెచ్‌ఐవీ, మల్టీడ్రగ్ రెసిస్టెంట్ టీబీ తదితర వ్యాధుల చికిత్సకు వినియోగించగల పలు ఔషధాలను రూపొందించిన విషయాన్ని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment