రానున్న అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధికంగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
(RBI Penalty: బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా)
అక్టోబర్ సెలవుల జాబితాలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు 7 ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. పండుగ లేదా గెజిట్ హాలిడేస్ 11 ఉన్నాయి. వీటిలో కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. మరికొన్ని రాష్ట్రానికి రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా ఉండవచ్చు.
(గడువు ముగియనున్న ఎల్‌ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ)
అక్టోబర్ నెల ప్రారంభంలోనే మొదటి రెండు రోజులు వరుసుగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం కాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 24న దసరా కారణంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా చాలా బ్యాంకులు మూతపడనున్నాయి.
అక్టోబర్ సెలవుల జాబితా ఇది..
- అక్టోబర్ 1: ఆదివారం
- అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
- అక్టోబర్ 8: ఆదివారం
- అక్టోబర్ 14: రెండవ శనివారం
- అక్టోబర్ 14: మహాలయ (కోల్‌కతా)
- అక్టోబర్ 15: ఆదివారం
- అక్టోబర్ 18: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా)
- అక్టోబర్ 21: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా)
- అక్టోబర్ 22: ఆదివారం
- అక్టోబర్ 23: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం).
- అక్టోబర్ 24: దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా)
- అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
- అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్)
- అక్టోబర్ 27: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
- అక్టోబర్ 28: లక్ష్మీ పూజ (కోల్‌కతా)
- అక్టోబర్ 28: నాల్గవ శనివారం
- అక్టోబర్ 29: ఆదివారం
- అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)
Comments
Please login to add a commentAdd a comment