ప్రస్తుత కాలంలో ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా మనకు గూగులే దిక్కు. ఈ 4జీ యుగంలో అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు.. ఫోన్లోనే భూగోళాన్ని చుట్టేస్తున్నారు. అయితే గూగుల్ సెర్చ్ లో ఏది వెతికినా దొరికేస్తుందని మనకు తెలుసు. కానీ, కొన్నింటి సమాచారం గూగుల్‌లో వెతికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ కి సంభందించి, కస్టమర్ కేర్ నంబర్లు గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఇలాంటి నంబర్ల కోసం సెర్చ్ చేయక పోవడమే మంచిది. తెలియకుండా సెర్చ్ చేస్తే అనవసరంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కే ప్రమాదం ఉంటుంది.
సైబరాబాద్ పరిధిలో 1395 కేసుల్లో ఇలాంటి మోసాలే ఎక్కువగా ఉన్నాయి. 189 కేసుల్లో బాధితులు రూ.1.01 కోట్ల డబ్బులు పోగొట్టుకున్నారు. బ్యాంకులు, టెలికాం సంస్థలు, ఫుడ్ డెలివరీ యాప్‌లు, ట్రావెల్స్, కొరియర్, గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి సంస్థలకు చెందిన కస్టమర్ కేర్ నంబర్లు కోసం చాలానే మంది సర్చ్ చేస్తున్నారు. అయితే, సైబర్ మోసగాళ్లు గూగుల్ యాడ్స్ కొనుగోలు చేసి నకిలీ వివరాలను పోస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే, గూగుల్ సర్చ్ ఇంజిన్(ఎస్ఈఓ) ద్వారా సైబర్ నెరగాళ్లు వారి పేర్కొన్న మొబైల్ నెంబర్ మొదట వచ్చే విధంగా చేస్తున్నారు. (చదవండి: ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!)
అందుకే గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి సంస్థకు వెబ్‌సైట్ లేదా యాప్ ఉంటుంది. అక్కడి నుంచే తీసుకోవాలి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఇటువంటి మోసల గురుంచి బ్యాంకులు తమ ఖాతాదారులును అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇలాంటి స్కామ్స్ గురించి కొద్ది రోజుల క్రితం వినియోగదారులను హెచ్చరిస్తూ ఒక వీడియోను ట్వీట్ చేసింది. మీరు చూడండి.
Beware of fraudulent customer care numbers. Please refer to the official website of SBI for correct customer care numbers. Refrain from sharing confidential banking information with anyone.#CyberSafety #CyberCrime #Fraud #BankSafe #SafeWithSBI pic.twitter.com/Q0hbUYjAud
— State Bank of India (@TheOfficialSBI) September 18, 2021
Comments
Please login to add a commentAdd a comment