బయోకాన్ ఎండీ లేడీబాస్ కిరణ్ మజుందార్‌షా ఇంట విషాదం చోటు చేసుకుంది. కిరణ్ మజుందార్ తల్లి యామిని (91) శుక్రవారం కన్ను మూశారు. మగవాళ్ల ఆధిపత్యం అధికంగా ఉండే బ్రూయింగ్ ఇండస్ట్రీలో కిరణ్ మజుందార్ షా ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో యామిని మజుందార్ కీలక పాత్ర పోషించారు. కీలక సమయాల్లో కూతురికి అండగా ఉంటూ చేదోడు వాదోడుగా నిలిచారు. తల్లి మరణం తనకు ఎంతో తీరని లోటని కిరణ్ మజుందార్‌షా పేర్కొన్నారు.
తన జీవిత కాలంలో ఎక్కువ భాగం ఇంటి బాధ్యతలకే పరమితమయ్యారు యామిని. భర్త చనిపోయిన తర్వాత కిరణ్ ప్రోత్సాహంతో 68వ ఏట జీవెల్స్ పేరుతో లాండ్రీ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థను సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు యామిని. వ్యాపారాలతో పాటు సామాజిక అంశాల పట్ల కూడా యామిని చురుగ్గా ఉండేవారు. తన పద్దెనిమిదవ ఏట నుంచి చివరి శ్వాస వరకు ప్రతీ ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
A big bright light has gone out of my life. My darling mother Yamini passed away today - she has left a huge void. Om Shanthi 🙏 pic.twitter.com/vpSU7unqWD
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 3, 2022
చదవండి: ఆరోజున ముక్కున వేలేసుకున్నవారే? ఈ రోజు మురిసిపోతున్నారు !
Comments
Please login to add a commentAdd a comment