
బెంగళూరు: రాజకాలువలో, కుంటల్లో ఉండే మురుగునీటిని క్షణాల్లో పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ఆధునిక సాంకేతిక గాల్‌మొబైల్ యంత్రాన్ని బెంగళూరులో బొమ్మానహళ్ళి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోదీ కొంతకాలం కిందట ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ గాల్ మొబైల్ యంత్రాల పరిశ్రమను సందర్శించారని, వాటిని భారత్‌కు రప్పించడానికి కృషి చేశారని ఎమ్మెల్యే చెప్పారు.
గుజరాత్‌లో 20 గాల్ మొబైల్ యంత్రాలు తెప్పించారన్నారు. దీంతో తాను కూడా ఇజ్రాయెల్‌కు వెళఇ సుమారు రూ. 1 కోటి 25 లక్షల వ్యయంతో ఈ గాల్ మొబైల్‌ను తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఎలాంటి మురికి నీరు, ఉప్పు నీటినైనా తక్షణం శుభ్రం చేసి మంచినీటిగా మారుస్తుందని చెప్పారు.
చదవండి: ఆ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్.. .. ప్చ్, ఈఎంఐ మళ్లీ పెరిగింది!
Comments
Please login to add a commentAdd a comment