యూరోపియన్ యూనియన్‌లో సేవలందిస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బీఎన్‌పీ పారిబాస్ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా బీఎన్‌పీ పారిబాస్ ఇండియా టెరిటరీ హెడ్ అండ్ సీఈఓ సంజయ్ సింగ్ మాట్లాడుతూ..‘భారత్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలో 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎకానమీగా ఎదిగే అవకాశం ఉంది. భారత్ వృద్ధిలో సంస్థ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఆన్‌షోర్(దేశీయం), ఆఫ్‌షోర్(విదేశాలు) క్లయింట్‌లతో కొత్త వ్యాపార అవకాశాలతో బీఎన్‌పీ పారిబాస్ విస్తరిస్తోంది. భారత్లో వినియోగదారులకు పెంచుకుని మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: ఉప్పుడు బియ్యం ఎగుమతి సుంకంలో మార్పులు?
బీఎన్‌పీ పారిబాస్ అసెట్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, కమొడిటీస్, క్రెడిట్ కార్డులు, ఈక్విటీ ట్రేడింగ్, బీమా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ నిర్వహణ, మార్టగేజ్ రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ, సెక్యూరిటీ సర్వీసులు, రిస్క్ మేనేజ్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో సేవలందిస్తోంది. 31 డిసెంబర్ 2023 నాటికి కంపెనీలో యూరోపియన్ సంస్థాగత పెట్టుబడిదారులు 37.7% వాటా కలిగి ఉన్నారు. నాన్-యూరోపియన్ సంస్థాగత పెట్టుబడిదారులు 32.5%, బ్లాక్‌రాక్ 6.9%, బెల్జియన్ స్టేట్ 5.5%, రిటైల్ వాటాదారులు 5.9%, గ్రాండ్ డచీ ఆఫ్ లక్సెంబర్గ్ 1.1% వాటాలు కలిగి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment