Gift Cities
-
గిఫ్ట్సిటీలో యూరోపియన్ బ్యాంక్ ప్రారంభం
యూరోపియన్ యూనియన్‌లో సేవలందిస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఈ సందర్భంగా బీఎన్పీ పారిబాస్ ఇండియా టెరిటరీ హెడ్ అండ్ సీఈఓ సంజయ్ సింగ్ మాట్లాడుతూ..‘భారత్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలో 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎకానమీగా ఎదిగే అవకాశం ఉంది. భారత్ వృద్ధిలో సంస్థ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఆన్‌షోర్(దేశీయం), ఆఫ్‌షోర్(విదేశాలు) క్లయింట్లతో కొత్త వ్యాపార అవకాశాలతో బీఎన్పీ పారిబాస్ విస్తరిస్తోంది. భారత్‌లో వినియోగదారులకు పెంచుకుని మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: ఉప్పుడు బియ్యం ఎగుమతి సుంకంలో మార్పులు?బీఎన్పీ పారిబాస్ అసెట్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, కమొడిటీస్, క్రెడిట్ కార్డులు, ఈక్విటీ ట్రేడింగ్, బీమా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ నిర్వహణ, మార్టగేజ్ రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ, సెక్యూరిటీ సర్వీసులు, రిస్క్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో సేవలందిస్తోంది. 31 డిసెంబర్ 2023 నాటికి కంపెనీలో యూరోపియన్ సంస్థాగత పెట్టుబడిదారులు 37.7% వాటా కలిగి ఉన్నారు. నాన్-యూరోపియన్ సంస్థాగత పెట్టుబడిదారులు 32.5%, బ్లాక్‌రాక్ 6.9%, బెల్జియన్ స్టేట్ 5.5%, రిటైల్ వాటాదారులు 5.9%, గ్రాండ్ డచీ ఆఫ్ లక్సెంబర్గ్ 1.1% వాటాలు కలిగి ఉన్నారు. -
పెట్టుబడులకు హబ్‌గా గిఫ్ట్ సిటీ
గాంధీనగర్: పెట్టుబడులకు హబ్‌గా, ఆర్థిక రంగానికి సింహద్వారంగా గిఫ్ట్ సిటీ ఎదగనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారతీయ ఎంట్రప్రెన్యూర్లు అంతర్జాతీయంగా నిధులను సమీకరించుకోవడంలో తోడ్పడే విధంగా దీన్ని తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు. ‘‘గ్రీన్ క్రెడిట్స్’’ ట్రేడింగ్ కోసం కూడా గిఫ్ట్ సిటీ ఒక ప్లాట్‌ఫాంను తయారు చేయాలని, అలాగే 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు ఉపయోగపడే వైవిధ్యమైన ఫిన్‌టెక్ ప్రయోగశాలను కూడా నిర్మించాలని మంత్రి సూచించారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్)–ఐఎఫ్ఎస్సీలో ప్రస్తుతం 3 ఎక్సే్చంజీలు, 25 దేశ..విదేశ బ్యాంకులు, 26 ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ సంస్థలు, 80 ఫండ్ సంస్థలు, 50 పైచిలుకు ప్రొఫెషనల్ సరీ్వస్ ప్రొవైడర్లు, 40 ఫిన్‌టెక్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆమె చెప్పారు. 2070 కల్లా కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించడానికి భారత్ దగ్గర ఉన్న వనరులకు, అవసరమైన నిధుల మధ్య 10.1 ట్రిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉందని మంత్రి చెప్పారు. గిఫ్ట్ సిటీ దీన్ని భర్తీ చేయడంలో సహాయకరంగా ఉండగలదన్నారు. ప్రపంచానికి చోదకశక్తిగా ఎదిగిన భారత్.. అటు సంపన్న పాశ్చాత్య దేశాలు, ఇటు గ్లోబల్ సౌత్ (వర్ధమాన, పేద) దేశాలకు మధ్య వారధిగా నిలవగలదని ఆమె చెప్పారు. -
Gujarat: లిక్కర్ బ్యాన్ సడలింపు..కాంగ్రెస్ ఫైర్
అహ్మదాబాద్: రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి గుజరాత్లో అమలులో ఉన్న లిక్కర్ నిషేదంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరిమిత సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆ పార్టీ ఎంపీ శక్తిసింగ్ గొహిల్ ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. లిక్కర్ బ్యాన్ సడలింపులు రాష్ట్రంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయని గొహిల్ హెచ్చరించారు.ఈ సడలింపుల వల్ల ప్రభుత్వం ఎలాంటి లాభం పొందాలనుకుంటోందో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ(గిఫ్ట్ సిటీ)లో లిక్కర్ అందుబాటులో ఉంటుందని స్టేట్ ఎక్సైజ్ శాఖ తాజాగా ప్రకటించింది. చాలా కాలం పాటు బ్యాన్ కొనసాగించి సడెన్‌గా గిఫ్ట్ సిటీలో లిక్కర్ అమ్మకాలు అనుమతించడానికి బలమైన కారణాలున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. ‘భారీగా పన్ను రాయితీలున్న అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం కావడంతో గిఫ్ట్ సిటీలో దేశీయ, విదేశ కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఈ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులకు లిక్కర్ అమ్మేందుకు తాత్కాలిక ప్రాతిపదికన హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులకు అనుమతిచ్చినట్లు గుజరాత్ స్టేట్ నార్కొటిక్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపింది. సింగపూర్ లాంటి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ కేంద్రాలతో పోటీ పడి ఆర్థిక సేవల రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీలకు సులభతర రెగ్యులేటరీ నిబంధనలతో పాటు భారీ పన్ను రాయితీలను ప్రభుత్వం కల్పించింది. ఇదీచదవండి..మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ! -
నిధుల సమీకరణకు ‘ద్వంద్వ లిస్టింగ్’ మార్గం
ముంబై: చిన్న వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తమ మూలధన సమీకరణ పక్రియను విస్తృతం చేయడానికి ‘‘ద్వంద్వ లిస్టింగ్’’ను పరిగణనలోకి తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. బొంబాయి స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌తోపాటు గాంధీనగర్ గిఫ్ట్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో లిస్ట్ అయ్యే అవకాశాలు, ప్రయోజనాలను పరిశీలించాలని కోరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 400 కంపెనీల లిస్టింగ్ అయిన సందర్భాన్ని పురష్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► నిధుల సమీకరణకు సంబంధించి లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని గిఫ్ట్ సిటీ ప్లాట్‌ఫామ్ లేదా ముంబై బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ లేదా రెండింటిలో ద్వంద్వ లిస్టింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ దిశలో మార్గాలను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తగిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. ఉంటుందన్నది పరిశీలించాలి. ► ద్వంద్వ లిస్టింగ్ దేశీయ మూలధన సమీకరణకు దోహదపడుతుంది. అదే విధంగా గిఫ్ట్ సిటీలో పెట్టుబడుల యోచనలో ఉన్న అంతర్జాతీయ సంస్థల నిధులను పొందడంలోనూ ఇది సహాయపడుతుందని భావిస్తున్నాం. ► అంతర్జాతీయ ఫండ్లు కూడా ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకునేలా తగిన చర్యలు అవసరం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సావరిన్ వెల్త్ ఫండ్లు ఈ ఎక్సే్ఛంజ్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా బీఎస్ఈ ప్రయత్నాలు జరపాలి. ► ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం దానిని మరింత విస్తృతం చేయాలి. మరింత మంది దేశీయ పెట్టుబడిదారులను పొందాలి. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వీటిపై అవగాహన కల్పించాలి. ► ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో మొదట లిస్టయిన 150 చిన్న కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై వ్యాపారం చేయడానికి అన్ని అర్హతలూ పొందాయి. ► మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రలను పునరుద్ధరించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంది. ఈ దిశలో ఈసీఎల్‌జీసీ, టీఆర్‌ఈడీఎస్‌సహా పలు పథకాలను, చర్యలను అమలు చేసింది. ► మనం మహమ్మారిని అధిగమించగలిగాము. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన పరిశ్రమ విశ్వాసం, స్ఫూర్తిని నిరోధించలేదు. ► స్టార్టప్‌ల విషయంలో దేశం పురోగమిస్తోంది. భారత్ 100 కంటే ఎక్కువ యునికార్న్‌లకు (బిలియన్ డాలర్లపైన విలువగలిగిన సంస్థలు), 70–80 ‘సూనికార్న్‌లకు‘ (యూనికార్న్‌లుగా మారడానికి దగ్గరిగా ఉన్న సంస్థలు) నిలయంగా ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానానికి బీఎస్ఈ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్టార్టప్స్‌లోకి భారీ దేశీయ పెట్టుబడులు వెళ్లడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నాం. దేశీయ ఇన్వెస్టర్లు యూనికార్న్స్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ధోరణి మారాలి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) ప్లాట్‌పామ్‌పై 400 కంపెనీలు లిస్టయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్‌లో బుల్ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. కార్యక్రమంలో బీఎస్ఈ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఈ ఎంఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 60,000 కోట్లు దాటింది. -
గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?!
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని తొలి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్(ఐఎఫ్ఎస్సీ)లో బ్యాంకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు జర్మనీ దిగ్గజం డాయిష్ బ్యాంక్‌కు తాజాగా అనుమతి లభించింది. ఇందుకు గిఫ్ట్(జీఐఎఫ్‌టీ) ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) అథారిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి గిఫ్ట్ సిటీ సెజ్‌లో డాయిష్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ బ్యాంకింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది. కాగా.. డాయిష్ బ్యాంక్‌కు అనుమతి నేపథ్యంలో మరిన్ని విదేశీ దిగ్గజాలు గిఫ్ట్ సిటీవైపు దృష్టిసారించే వీలున్నట్లు తపన్ రాయ్ పేర్కొన్నారు. దీంతో విదేశీ బ్యాంకులకు ఎఫ్‌పీఐ, ఎన్డీఎఫ్, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ తదితర పలు బిజినెస్ అవకాశాలు లభించనున్నట్లు గిఫ్ట్ సిటీ గ్రూప్ ఎండీ, సీఈవో రాయ్ వివరించారు. ప్రధానంగా ఫైనాన్సింగ్, ట్రేడ్, కరెన్సీలు తదితర విభాగాలలో తమ క్లయింట్లకు అంతర్జాతీయ బిజినెస్ లావాదేవీల నిర్వహణకు ఈ యూనిట్ సహకరించనున్నట్లు డాయిష్ బ్యాంక్ సీఈవో కౌశిక్ షపారియా తెలియజేశారు. ఇప్పటివరకూ దేశీ కార్యకలాపాలపై రూ. 19,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించినట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో 2015లో ఏర్పాటైన ఐఎఫ్ఎస్సీ ఫైనాన్షియల్ రంగంలోని పలు దేశ, విదేశీ సంస్థలను ఆకట్టుకుంటోంది. -
గిఫ్ట్ సిటీలు అభివృద్ధి చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులకు లాభం చేకూర్చేలా వారిని భాగస్వాములను చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గిఫ్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. దేశంలోని చాలా నగరాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో నగరం, పట్టణాల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను తీసుకుని నివాస సముదాయాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో 3వేల ఎకరాలకు ఒక టౌన్ చొప్పున నిర్మిస్తామని, అందుకు రైతుల నుంచి భూమి సేకరిస్తామని వెల్లడించారు. సేకరించిన భూమికి ధర కట్టి అందుకు సమానంగా సదరు లే అవుట్లలో రైతులకు వాటా కల్పిస్తామన్నారు. దీంతో రైతులకు లాభం చేకూరుతుందన్నారు. నివాస సముదాయాల లే అవుట్లలో పారదర్శకత ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించిన విధానం తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పన్నెండేళ్ల వివాదానికి పరిష్కారం ఉప్పల్ భగావత్ ప్రాంతంలో హెచ్ఎండీఏ అధ్వర్యంలో చేపట్టిన నివాస గృహాల లే అవుట్‌కు సంబంధించిన బాధితులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. మంత్రి కేటీఆర్, ఎంపీ మల్లారెడ్డి తదితరులతో కలసి వచ్చిన బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో దాదాపు 12 ఏళ్ల కిందట నాటి ప్రభుత్వం వివిధ అవసరాలకు స్థానిక రైతుల నుంచి 754 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో సీవరేజీ ప్లాంటుకు, మెట్రో రైలు ప్రాంగణం నిర్మాణానికి, వాటర్ వర్క్స్ కోసం పోయిన భూమి కాకుండా మిగిలిన 430 ఎకరాలను హెచ్ఎండీఏ లే అవుట్ చేసింది. రైతుల నుంచి భూమి తీసుకునే క్రమంలో ఎకరా భూమి కోల్పోయిన రైతుకు అభివృద్ధి చేసిన లే అవుట్లో 1000 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ రైతులు ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో 54 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోనిదని తర్వాత తేలింది. దీంతో సదరు భూమి అమ్మిన రైతులకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎకరాకు వెయ్యి గజాలు ఇవ్వడం కుదరదని అప్పటి ప్రభుత్వం తేల్చిచెప్పింది. దసరా లోపే నివాస స్థలం కేటాయింపు తాము భూమి కొనే సందర్భంలో కానీ.. ఆ భూమిని ప్రభుత్వానికి అమ్మే సందర్భంలో కానీ అది అర్బన్ లాండ్ సీలింగ్ భూమి అని తమకు తెలియదని బాధితులు 12 ఏళ్ల నుంచి ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమిని ప్రభుత్వానికి అప్పగించిన రైతులకు ఎకరాకు 600 గజాల చొప్పున నివాస స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. పట్టా భూములు అప్పగించిన వారికి ఎకరాకు వెయ్యి గజాల చొప్పున కేటాయించే నిర్ణయం ఇప్పటికే జరిగినందున వెంటనే వారికి నివాస స్థలం కేటాయించి మార్కింగ్ చేయాలన్నారు. నివాస స్థలం అప్పగించే ప్రక్రియ దసరా లోపు పూర్తి కావాలని మంత్రి కేటీఆర్, ఎంపీ మల్లారెడ్డిని ఆదేశించారు.