గాంధీనగర్: పెట్టుబడులకు హబ్‌గా, ఆర్థిక రంగానికి సింహద్వారంగా గిఫ్ట్ సిటీ ఎదగనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారతీయ ఎంట్రప్రెన్యూర్లు అంతర్జాతీయంగా నిధులను సమీకరించుకోవడంలో తోడ్పడే విధంగా దీన్ని తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు.
‘‘గ్రీన్ క్రెడిట్స్’’ ట్రేడింగ్ కోసం కూడా గిఫ్ట్ సిటీ ఒక ప్లాట్‌ఫాంను తయారు చేయాలని, అలాగే 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు ఉపయోగపడే వైవిధ్యమైన ఫిన్‌టెక్ ప్రయోగశాలను కూడా నిర్మించాలని మంత్రి సూచించారు.
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్)–ఐఎఫ్‌ఎస్‌సీలో ప్రస్తుతం 3 ఎక్సే్చంజీలు, 25 దేశ..విదేశ బ్యాంకులు, 26 ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ సంస్థలు, 80 ఫండ్ సంస్థలు, 50 పైచిలుకు ప్రొఫెషనల్ సరీ్వస్ ప్రొవైడర్లు, 40 ఫిన్‌టెక్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆమె చెప్పారు.
2070 కల్లా కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించడానికి భారత్ దగ్గర ఉన్న వనరులకు, అవసరమైన నిధుల మధ్య 10.1 ట్రిలియన్ డాలర్ల వ్యత్యాసం ఉందని మంత్రి చెప్పారు. గిఫ్ట్ సిటీ దీన్ని భర్తీ చేయడంలో సహాయకరంగా ఉండగలదన్నారు. ప్రపంచానికి చోదకశక్తిగా ఎదిగిన భారత్.. అటు సంపన్న పాశ్చాత్య దేశాలు, ఇటు గ్లోబల్ సౌత్ (వర్ధమాన, పేద) దేశాలకు మధ్య వారధిగా నిలవగలదని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment