BNP Paribas
-
గిఫ్ట్సిటీలో యూరోపియన్ బ్యాంక్ ప్రారంభం
యూరోపియన్ యూనియన్‌లో సేవలందిస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.ఈ సందర్భంగా బీఎన్పీ పారిబాస్ ఇండియా టెరిటరీ హెడ్ అండ్ సీఈఓ సంజయ్ సింగ్ మాట్లాడుతూ..‘భారత్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలో 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎకానమీగా ఎదిగే అవకాశం ఉంది. భారత్ వృద్ధిలో సంస్థ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఆన్‌షోర్(దేశీయం), ఆఫ్‌షోర్(విదేశాలు) క్లయింట్లతో కొత్త వ్యాపార అవకాశాలతో బీఎన్పీ పారిబాస్ విస్తరిస్తోంది. భారత్‌లో వినియోగదారులకు పెంచుకుని మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: ఉప్పుడు బియ్యం ఎగుమతి సుంకంలో మార్పులు?బీఎన్పీ పారిబాస్ అసెట్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, కమొడిటీస్, క్రెడిట్ కార్డులు, ఈక్విటీ ట్రేడింగ్, బీమా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ నిర్వహణ, మార్టగేజ్ రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ, సెక్యూరిటీ సర్వీసులు, రిస్క్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో సేవలందిస్తోంది. 31 డిసెంబర్ 2023 నాటికి కంపెనీలో యూరోపియన్ సంస్థాగత పెట్టుబడిదారులు 37.7% వాటా కలిగి ఉన్నారు. నాన్-యూరోపియన్ సంస్థాగత పెట్టుబడిదారులు 32.5%, బ్లాక్‌రాక్ 6.9%, బెల్జియన్ స్టేట్ 5.5%, రిటైల్ వాటాదారులు 5.9%, గ్రాండ్ డచీ ఆఫ్ లక్సెంబర్గ్ 1.1% వాటాలు కలిగి ఉన్నారు. -
అస్థిరతల్లో స్థిరమైన పనితీరు
గతేడాది మొదలైన అస్థిరతలు మార్కెట్లలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈక్విటీ మార్కెట్లు అంటేనే అస్థిరతలకు నిలయం అని ఇన్వెస్టర్లకు తెలిసిన విషయమే. ఇలాంటి అస్థిరతలు, అధిక, చౌక వ్యాల్యూషన్ల మధ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అందుకు బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అనుకూలమని చెప్పుకోవాలి. ఈ విభాగంలో బరోడా బీఎన్పీ పారిబాస్ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఒక మోసర్తు రిస్క్ తీసుకునే వారికి ఇది అనుకూలం. పెట్టుబడుల విధానం బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ పథకాలు ఈక్విటీతోపాటు, డెట్‌లోనూ పెట్టుబడులు పెడుతుంటాయి. మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ పథకాల్లో నష్టాలు తక్కువగా ఉంటాయి. కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. రాబడులు బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ విభాగంలో టాప్ పథకాల్లో ఇది కూడా ఒకటి. స్థిరమైన పనితీరు చూపిస్తోంది. నిఫ్టీ 50 హైబ్రిడ్ కాంపోజిట్ డెట్ 50:50 ఇండెక్స్‌ను మించి పనితీరు చూపిస్తోంది. ఈ పథకం 2018 నవంబర్‌లో మొదలైంది. అంటే నాలుగేళ్ల చరిత్రే ఉంది. అయినా కానీ ఆరంభం నుంచి చూస్తే వార్షికంగా 12.73 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 8 శాతంగా ఉంటే, మూడేళ్ల కాలంలో వార్షికంగా 13 శాతానికి పైనే రాబడుల చరిత్ర ఉంది. పెట్టుబడుల విధానం ఈ పథకం ఈక్విటీ, డెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. పరిస్థితులు, మార్కెట్ అవకాశాలకు తగ్గట్టు డెట్‌లో గరిష్టంగా 35 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీలకు 86–87 శాతం వరకు కేటాయింపులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా మారాయని భావించినప్పుడు ఈక్విటీల పెట్టుబడులు తగ్గించి, డెట్ పెట్టుబడులను ఫండ్ మేనేజర్ పెంచుతారు. ఈక్విటీలు కరెక్షన్కులోనై ఆకర్షణీయ స్థాయికి చేరినప్పుడు డెట్‌లో పెట్టుబడులు తగ్గించుకుని, ఈక్విటీలకు పెంచుకోవడం చేస్తుంటారు. ఉదాహరణకు 2020 మార్చి సమయంలో మార్కెట్లు కరోనా భయంతో భారీ దిద్దుబాటుకు గురి కావడం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను మొత్తం పోర్ట్‌ఫోలియోలో 87 శాతానికి చేర్చుకోవడాన్ని గమనించొచ్చు. తిరిగి 2020 సెప్టెంబర్ నుంచి ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకోవడం మొదలు పెట్టారు. కనిష్టాల నుంచి సెప్టెంబర్ నాటికి మార్కెట్లు ర్యాలీ చేయడంతో ఈ విధానాన్ని అమలు చేశారు. 2022 జూన్–జూలైలోనూ ఈక్విటీలు దిద్దుబాటుకు గురికాగా, అప్పుడు ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెంచుకుని, తిరిగి ఇటీవలి కాలంలో తగ్గించుకున్నారు. పీఈ, బుక్ వ్యాల్యూ, డివిడెండ్ ఈల్డ్ ఆధారంగా స్టాక్స్, మార్కెట్ల వ్యాల్యూషన్లను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియో.. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.3,146 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 67 శాతం ఈక్విటీలో, 29.59 శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంది. 3 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 40 స్టాక్స్ ఉన్నాయి. డెట్ పెట్టుబడుల్లో దాదాపు మొత్తం కూడా క్రెడిట్ రేటింగ్ మెరుగ్గా ఉన్న సాధనాల్లో ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ 23 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు 7.50 శాతం, ఇంధన, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు చెరో 6 శాతంపైనే కేటాయింపులు చేసింది. -
ఎస్బీఐ లైఫ్ నుంచి బీఎన్పీ పరిబాస్ ఎగ్జిట్!
ముంబై: దేశీ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), గ్లోబల్ దిగ్గజం బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భాగస్వామ్యానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన 5.2 శాతం వాటాను బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ విక్రయించేందుకు నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. బ్లాక్ డీల్ ద్వారా ఈ వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా 5.2 శాతం వాటాకు రూ. 4,312 కోట్లు లభించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు శుక్రవారం రూ. 863 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 8 శాతం లాభపడింది. విక్రయాల బాట దేశీ భాగస్వామ్య సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాను గత రెండేళ్లుగా యూరోపియన్ దిగ్గజం బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ విక్రయిస్తూ వస్తోంది. 2019 జూన్‌లో ఎస్బీఐ లైఫ్‌లో 2.5 శాతం వాటాను బీఎన్పీ పరిబాస్ రూ. 1,625 కోట్లకు విక్రయించింది. ఈ బాటలో 2019 మార్చిలో 5 శాతం వాటాను రూ. 2,889 కోట్లకు అమ్మివేసింది. తదుపరి మరో 9.2 శాతం వాటాను రూ. 4,751 కోట్లకు విక్రయించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) కంటే బ్లాక్‌డీల్ ద్వారా వాటా విక్రయాన్ని వేగంగా చేపట్టవచ్చని ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు ప్రస్తావించారు. ప్రస్తుతం ఎస్బీఐ లైఫ్‌లో ప్రమోటర్‌గా ఉన్న బీఎన్పీ పరిబాస్ కార్డఫ్కు 5.2 శాతం వాటా మాత్రమే ఉంది. మరోవైపు ఈ జేవీలో ప్రమోటర్‌గా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 55 శాతం వాటాను కలిగి ఉంది. 5 శాతం మించితే కంపెనీ ఈక్విటీలో 5 శాతం వాటాకు మించి విక్రయం, కొనుగోలు లేదా తనఖా చేపట్టదలిస్తే.. ఇందుకు ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుందంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2020 జులైలో స్పష్టం చేసింది. కాగా.. బీఎన్పీ పరిబాస్ వాటా విక్రయ అంశంపై ఎస్బీఐ లైఫ్.. మార్కెట్ అంచనాలపై తాము స్పందించబోమంటూ వ్యాఖ్యానించింది. జేవీ బ్యాక్‌గ్రౌండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 2001లో భాగస్వామ్య సంస్థ(జేవీ)గా ఏర్పాటైంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్, బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ ప్రమోటర్లు కాగా.. 2017 అక్టోబర్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికల్లా బీమా రంగ మార్కెట్లో 11.7 శాతం వాటాను కలిగి ఉంది. బీమా రంగ గ్లోబల్ కంపెనీ బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ 33 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. 2019లో 29.8 బిలియన్ యూరోల స్థూల రిటెన్ ప్రీమియంల విలువను సాధించింది. -
షేర్‌ఖాన్‌లో బీఎన్పీ పారిబా మరిన్ని పెట్టుబడులు
ముంబై: ఫ్రాన్స్ ఆర్థిక దిగ్గజం బీఎన్పీ పారిబా ఇటీవలే కొనుగోలు చేసిన రిటైల్ బ్రోకింగ్ సంస్థ షేర్‌ఖాన్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నది. ఐదేళ్లలో షేర్‌ఖాన్‌లో 7 కోట్ల యూరోల (సుమారుగా రూ.449 కోట్ల)పెట్టుబడులు పెడతామని బీఎన్పీ పారిబా తెలిపింది. బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ నుంచి వైదొలగడం లేదని స్పష్టం చేసింది. షేర్‌ఖాన్ డిజిటల్ ప్లాట్ఫార్మ్ను అప్‌గ్రేడ్ చేయడం కోసం 1.5–2 కోట్ల యూరోలు(రూ.105–140 కోట్లు) ఖర్చు చేయనున్నామని బీఎన్పీ పారిబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు టెర్రీ లబొర్డే చెప్పారు. డిజిటల్ ప్లాట్ఫార్మ్ అప్‌గ్రేడ్ కారణంగా ప్రస్తుతం 14 లక్షలుగా ఉన్న వినియోగదారుల సంఖ్య రెట్టింపై 29 లక్షలకు చేరగలదని పేర్కొన్నారు. షేర్‌ఖాన్ కొనుగోలు చేసినప్పటికీ, తమకు ప్రస్తుతం 32.6 శాతం వాటా ఉన్న జియోజిత్ నుంచి వైదొలగబోమని బీఎన్పీ పారిబా ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్ జోరిస్ డెరిక్స్ తెలిపారు. -
భారత్ జీడీపీ అంచనాలు కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను 3.7 శాతానికి కుదిస్తున్నట్లు ఫ్రాన్స్‌కి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్పీ పారిబా వెల్లడించింది. గతంలో ఇది 5.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. చిన్నపాటి అలజడి వేగంగా పెను సంక్షోభం స్థాయికి పెరిగిపోతోన్న నేపథ్యంలో వృద్ధి అంచనాలు తగ్గించినట్లు బీఎన్పీ తెలిపింది. రూపాయి బలహీనత, విద్యుత్ వ్య యాలు పెరిగిపోతుండటం, విధానపరమైన అనిశ్చితి ఇందుకు కారణమవుతున్నాయని వివరించింది. వచ్చే 6-9 నెలల్లో సమస్యలు తీవ్రరూపు దాలుస్తాయని పేర్కొంది. 2014-15లో పరిస్థితులు కాస్త మెరుగై జీడీపీ వృద్ధి 5.3 శాతంగా ఉండొచ్చని తెలిపింది.