ఉద్యోగులను తొలగించిన జాబితాలో ఇప్పటికే గూగుల్ వంటి బడా సంస్థల పేర్లు చేరాయి. ఈ జాబితాలోకి తాజాగా బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ కూడా చేరనుంది. ఈ కంపెనీ కూడా 8 శాతం ఉద్యోగులను తొలగించున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
1,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్న బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ ఇప్పుడు సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీ CEO నిర్ బార్ డియా మాట్లాడుతూ.. గత ఏడాది అక్టోబర్‌లో రే డాలియో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కంపెనీలో కొంత మందిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కొంత బాధాకరం అని కూడా వెల్లడించారు.
(ఇదీ చదవండి: మ్యాటర్ ఎనర్జీ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర తక్కువ, సూపర్ డిజైన్)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పెట్టుబడి పెట్టడం, దాని ప్రస్తుత వనరులను పునర్నిర్మించే ప్రణాళికల గురించి కూడా సిఈఓ ఈ సందర్భంగా మాట్లాడారు. బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ పదవీ విరమణ గురించి 2022 అక్టోబర్‌లో రే డాలియో ప్రకటించారు. ఆ తరువాత నిర్ బార్ డియా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి నాయకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment