బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆగస్టు 1న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 2 శాతం దరిదాపుల్లో స్థిరంగా ఉంటున్న నేపథ్యంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
2021 జులైలో బ్రిటన్‌లో చివరి సారిగా ద్రవ్యోల్బణం 2 శాతంగా నమోదైంది. కానీ క్రమంగా అది పెరుగుతూ 2022 నాటికి 11 శాతానికి చేరింది. దాంతో కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చారు. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధర పెరుగడంతో వడ్డీరేట్లలో మార్పులు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఇంధన ఖర్చులూ అధికమయ్యాయి. అయితే కొంతకాలం నుంచి క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతూ వస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ ద్రవ్యోల్బణం 2 శాతానికి దరిదాపుల్లోకి రావడంతో ఆగస్టు 1న వడ్డీరేట్లను తగ్గిస్తారని నిపుణులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో 5.25 శాతం వడ్డీరేటు ఉంది.
ఇదీ చదవండి: రూ.2 వేలకోట్ల ఆర్థిక సహాయానికి ఏడీబీ ఆమోదం
ఇదిలాఉండగా, ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరొమ్ ఫావెల్ మీడియాతో మాట్లాడుతూ యూఎస్‌లో కీలకవడ్డీ రేట్లను పెంచే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. అయితే తగ్గిస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వడ్డీ రేట్లను తగ్గించాలంటే మరికొన్ని నివేదికలు అవసరమన్నారు. జులైలో 30-31న జరిగే ఫెడ్ సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment