రైల్వే శాఖపై కేంద్రం కీలక నిర్ణయం..! | Central Government Plans For IRCTC Offer For Sale | Sakshi
Sakshi News home page

రైల్వే శాఖపై కేంద్రం కీలక నిర్ణయం..!

Aug 21 2020 7:07 PM | Updated on Aug 21 2020 7:16 PM

Central Government Plans For IRCTC Offer For Sale - Sakshi

న్యూఢిల్లీ: రైల్వే శాఖపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్ (ఐఆర్‌సీటీసీ) లోని తన వాటాల్లో కొంత షేర్ల భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలని(అమ్మకం) యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టబడలకు సంబంధించిన సంస్థ (డీఐపీఏఎం) అమ్మకాల ప్రక్రియను నిర్వహించడానికి సెప్టెంబర్ 10 లోగా సెబీలో నమోదు చేసుకున్న మర్చంట్ బ్యాంకర్ల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది.  కాగా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబి) నియమ నిబంధనలకు అనుగుణంగానే షేర్ల అమ్మాకలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు రెల్వేలో పనిచేసే ఉద్యుగలకు అర్హత ఉంటే షేర్లలో డిస్కౌంట్లు ప్రకటించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విక్రయ ప్రక్రియపై మర్చెంట్‌ బ్యాంకర్లు అధ్యయనం చేయాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా సంస్థ మూలధనం రూ.250 కోట్లు కాగా, పెయిడ్ అప్ క్యాపిటల్ రూ .160 కోట్లు. ప్రస్తుతం రైల్వే శాఖ షేర్ క్యాపిటల్‌లో 87.40 శాతం  వాటాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బీఎస్‌ఇ లో(బాంబే స్టాక్‌ ఎక్స్చెంజ్‌) ఐఆర్‌సీటీసీ షేర్లు రూ .1,351.65 వద్ద ట్రేడవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement