
సోషల్ మీడియాలో యూజర్ల భద్రతే లక్ష్యంగా కేంద్రం కొత్త ఐటీ రూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా ప్రకారం.. సోషల్ మీడియా కంటెంట్‌పై యూజర్లు ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా గ్రివెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం..ఈ కొత్త ఐటీ రూల్ అమల్లోకి వచ్చిన ప్రారంభ తేదీ(నేటి)నుండి మూడు నెలల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫిర్యాదులపై అప్పీలేట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
ఏ వినియోగదారు అయినా 30 రోజుల వ్యవధిలో ప్రభుత్వం నియమించిన గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)కి అప్పీల్ చేయవచ్చు. జీఏసీలు 30 రోజులలోపు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయి. నిపుణుల సహకారం తీసుకుంటాయి. తద్వారా అప్పీల్ ఫైల్ చేయడం నుండి దాని నిర్ణయం వరకు మొత్తం అప్పీల్ ప్రక్రియ డిజిటల్‌గా నిర్వహించబడుతుంది’ అని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఐటీ రూల్‌లో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment