భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈవీ శకం మొదలైంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలతో సమానంగా ఇండియన్ ఈవీ స్టార్టప్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు స్టార్టప్స్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలతో భారత ఆటోమొబైల్ సెక్టార్‌ను ఊపేస్తున్నాయి. తాజాగా ఇగ్నీట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ భారత ఈవీ మార్కెట్లలోకి సరికొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ Cyborg GT120ను లాంచ్ చేసింది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే..180కి.మీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే Cyborg GT 120 బుల్లెట్ వేగంతో దూసుకెళ్లనుంది. ఈ బైక్ గరిష్టంగా 125kmph వేగంతో ప్రయాణించనుంది. బైక్ రేంజ్ విషయానికి వస్తే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 180కి.మీ దూరం మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్‌లో 4.68kWhr లిథియం-అయాన్ బ్యాటరీను అమర్చారు.ఇది 6000 W గరిష్ట శక్తి రిలీజ్ చేయనుంది. Cyborg GT 120 బ్యాటరీ 0 నుంచి 80శాతం ఛార్జ్ చేయడానికి 3 గంటలు, 100 శాతం ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు సమయం పడుతుంది. కాగా ఈ బైక్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెలలో బైక్ ధరను వెల్లడించనున్నట్లు సమాచారం. ఇది బ్లాక్, పర్పుల్ రెండు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. మోటారు, బ్యాటరీ, వాహనంపై 5 సంవత్సరాల వారంటీతో రానుంది.
ఇతర ఫీచర్స్..!
సైబోర్గ్ GT 120లో కాంబి బ్రేక్ సిస్టమ్ (CBS) ముందు భాగంలో డిస్క్ బ్రేక్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉన్నాయి.ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌లో జియో-ఫెన్సింగ్, జియో-లొకేషన్, USB ఛార్జింగ్, బ్లూటూత్, కీలెస్ ఇగ్నిషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్స్ కూడా ఉన్నాయి. క్లస్టర్‌లో LED డిస్‌ప్లేను కల్గి ఉంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP65 రేటింగ్‌తో రానుంది.ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది - ఎకో, నార్మల్, స్పోర్ట్స్. పార్కింగ్ అలర్ట్‌ను కూడా అందించనుంది.
కుర్రకారే లక్ష్యంగా..!
ఇగ్నీట్రాన్ మెటోకార్ప్ కుర్రకారును లక్ష్యంగా హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు Cyborg GT120తో కలిపి మూడు రకాల హై స్పీడ్ బైక్లను కంపెనీ లాంచ్ చేసింది. Cyborg Yoga, Cyborg Bob E, Cyborg GT 120 హై స్పీడ్ బైక్స్ అందుబాటులో ఉండనున్నాయి.
చదవండి: టెస్లాకు భారీ షాక్.. ఒక్కరోజుల్లో 100 బిలియన్ డాలర్ల వాల్యూ ఢమాల్
Comments
Please login to add a commentAdd a comment