ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడ్ బ్యాంకు వడ్డీ రేట్ల వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఎంత కాలం ఉంటుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో రిస్క్‌కి ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు.
ఈరోజు ఉదయం 9:10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 65 పాయింట్లు లాభపడి 55,614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 3 పాయింట్లు లాభపడి 16,633 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ కీలకమైన నిరోధక రేంజ్‌లో ఉండటంతో ఇన్వెస్టర్లు ఊగిసలాటలో ఉన్నారు.
స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
Published Mon, Mar 14 2022 9:17 AM | Last Updated on Mon, Mar 14 2022 9:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment