దేశంలో కొనసాగుతున్న డిజిటల్‌ చెల్లింపుల హవా..! | Digital Payments See Rapid Growth in March-September: RBI | Sakshi
Sakshi News home page

దేశంలో కొనసాగుతున్న డిజిటల్‌ చెల్లింపుల హవా..!

Published Thu, Jan 20 2022 8:31 AM | Last Updated on Thu, Jan 20 2022 8:31 AM

Digital Payments See Rapid Growth in March-September: RBI - Sakshi

ముంబై: దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు మంచి వృద్ధిని చూస్తున్నాయి. వీటి తీరును ప్రతిఫలించేందుకు ఆర్‌బీఐ ‘డిజిటల్‌ పేమెంట్‌ ఇండెక్స్‌ (ఆర్‌బీబీ-డీపీఐ)ను ఏర్పాటు చేసింది. ఈ సూచీ 2021 మార్చి నాటికి 270.59 దగ్గర ఉంటే.. 2021 సెప్టెంబర్‌ నాటికి 304.06కు చేరుకుంది. 2020 సెప్టెంబర్‌ నాటికి ఈ సూచీ 217.74గా ఉండడం గమనార్హం. అంటే కరోనా తర్వాత డిజిటల్‌ చెల్లింపులు నిరంతరాయంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 

ఆర్‌బీఐ-డీసీఐ సూచీ దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల ఆమోదం, విస్తృతిని తెలియజేస్తున్నట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ-డీపీఐ ఐదు ప్యారామీటర్ల ఆధారంగా దేశంలో డిజిటల్‌ చెల్లింపుల తీరును విశ్లేషిస్తుంటుంది. ఆరు నెలలకోసారి ఈ సూచీ గణాంకాలను ఆర్‌బీఐ ప్రకటిస్తుంటుంది.

(చదవండి: పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్.. అదిరిపోయిన టాటా మోటార్స్‌ సీఎన్‌జీ కార్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement