
తిరుపతి: ఈకో ఫినిక్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కేఫ్ స్టోరీస్‌లో సస్టైనబులిటీ, వేస్ట్‌మేనేజ్మెంట్‌పై శనివారం మీటప్ జరిగింది. ఈ మీటప్ సందర్భంగా ఈకో ఫినిక్స్ సీఈవో చందన్ కగ్గనపల్లి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వ్యర్ధాల నిర్వహణ ప్రక్రియను మనమే నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువ చేయాలని అన్నారు.
అలాగే రుసా సంస్థ యువ వ్యాపార వేత్తలకు వంశీ రాయల స్టాటర్జిక్ అప్లై గురించి దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వివిధ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, ప్రతినిధులు, ప్రణవి, కనిష్క శ్రేష‍్ట, మఫీద్, అభిలాష్, నేత్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment