
టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ సంస్థ డైరక్టర్ల బోర్డుకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ది హాలీవుడ్ రిపోర్టర్ కథనం ప్రకారం.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేఛేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ)కు కంపెనీ నుంచి ఎలన్ మస్క్ నిష్క్రమణ గురించి ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. మస్క్ రాజీనామా జూన్ 30, 2022 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. కంపెనీకి ఎలన్ అందించిన సేవలను కంపెనీ కొనియాడింది. స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కంపెనీకి అందించిన సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఎండీవర్ పేర్కొంది. తక్కువ సమయంలో కూడా కంపెనీపై శ్రద్ధ వహించినందుకు ఎండీవర్ ప్రతినిధులు మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్వతహాగానే ఎలన్ మస్క్ తన రాజీనామాను మార్చి 12న తెలియజేసినట్లు కంపెనీ పేర్కొంది.
మీడియా, మార్కెటింగ్‌లో భారీ ఆదరణ..!
అమెరికన్ సంస్థ ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ మీడియా, హాలీవుడ్, మార్కెటింగ్ విభాగాల్లో భారీ ఆదరణను పొందింది. ఈ సంస్థ దాని అనుబంధ సంస్థల ద్వారా వినోద కంటెంట్‌ను అందిస్తుంది.అలాగే మార్కెటింగ్, లైసెన్సింగ్, ప్రాతినిధ్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ కంపెనీలో విలియం మోరిస్ టాలెంట్ ఏజెన్సీ , అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ కంపెనీలను సబ్సీడరీ సంస్థలుగా కల్గి ఉంది.
చదవండి: బెజోస్ మస్క్ అదానీ ముందు దిగదుడుపే!
Comments
Please login to add a commentAdd a comment