న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమీక్ష నెల ఏప్రిల్‌లో సూచీ 15.08 శాతం పెరిగింది. అంటే 2021 ఏప్రిల్‌తో పోల్చితే 2022 ఏప్రిల్‌లో టోకు ఉత్పత్తుల బాస్కెట్ ధర 15.08 శాతం పెరిగిందన్నమాట. టోకు సూచీ పెరుగుదల రేటు రెండంకెలపైన ఉండడం ఇది వరుసగా 13వ నెల. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి టోకు ధరలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుత సిరీస్ (2011–12) సిరీస్‌లో 15.08 శాతం రికార్డు స్థాయి కావడం గమనార్హం. సూచీలోని అన్ని విభాగాలు– ఆహారం, ఇంధనం, తయారీ ధరలు ఏప్రిల్‌లో ఎగువముఖంగా పయనించడం గమనార్హం.
- ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.35 శాతం పెరిగింది. కూరగాయలు, గోధుమలు (10.70 శాతం), పండ్లు (10.89 శాతం), ఆలూ (19.84 శాతం) ధరలు గణనీయంగా పెరిగాయి. కూరగాయల ధరల్లో ఏకంగా 23.24 శాతం పెరుగుదల కనిపించింది.
- కోర్ ద్రవ్యోల్బణం (ఆహారం, ఇంధన రంగాలు కాకుండా వస్తువులు, సేవలకు సంబంధించి) వరుసగా మూడు నెలల నుంచి రెండంకెలపైన కొనసాగుతోంది. మార్చిలో ఈ రేటు 10.9% ఉంటే, ఏప్రిల్‌లో 11.1 శాతానికి ఎగసింది.
- ఇక తయారీ రంగం ద్రవ్యోల్బణం మార్చిలో 10.7% ఉంటే, ఏప్రిల్‌లో 10.9%కి ఎగసింది.
చదవండి: ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్..కొనేవారు కరువయ్యారు..! కానీ..!
Comments
Please login to add a commentAdd a comment