గత మూడేళ్ల స్థాయిలో ఉండకపోవచ్చు
ఇతక పాధనాల కంటే మెరుగే
ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్
ముంబై: ఈక్విటీ మార్కెట్లో రాబడులు వచ్చే మూడేళ్ల కాలంలో క్రితం మూడేళ్ల స్థాయిలో మాదిరి గొప్పగా ఉండకపోవచ్చని ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే మూడేళ్లలో ఈక్విటీ రాబడులు గౌరవనీయ స్థాయిలో, ఇతర పెట్టుబడి సాధనాల కంటే మెరుగ్గా ఉండొచ్చని ఈ సంస్థ ఈక్విటీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఆర్ జానకీరామన్ చెప్పారు.
ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ నుంచి కొత్తగా మలీ్టక్యాప్ ఫండ్ (ఎన్‌ఎఫ్‌వో)ను ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈక్విటీ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలకు చేరి, అధిక వ్యాల్యూషన్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో జానకీరామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ వృద్ధి దశ ఆరంభంలో ఉన్నందునే మార్కెట్ విలువలు అధికంగా ఉన్నట్టు, మరో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్‌లపై (ఐపీవో) స్పందిస్తూ.. అదనంగా వచ్చే పెట్టుబడుల ప్రవాహాన్ని సర్దుబాటు చేసుకునేందుకు కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు వేదిక కాగలవన్నారు.
గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని, కనుక దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించిన పెట్టుబడులు రిస్‌్కను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. ఈ సంస్థ నిర్వహణలోని ఆస్తుల్లో సగం మేర మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. భారత్ మరింత వృద్ధి చెందేకొద్దీ మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో మరిన్ని కంపెనీలు మెరుగ్గా రాణించడాన్ని చూస్తామంటూ.. ఈ విభాగం పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు.
రూ.లక్ష కోట్ల మైలురాయి
తమ నిర్వహణలోని ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్లను అధిగమించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మ్యూచువల్ ఫండ్ ప్రెసిడెంట్ అవినాష్ సత్వాలేకర్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి చివరికి 15వ అతిపెద్ద అస్సెట్ మేనేజర్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ త్రైమాసికంలోనే పలు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (డెట్) పథకాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ మలీ్టక్యాప్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వో ఈ నెల 8న ప్రారంభమై, 22 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment