సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2023 ఫిబ్రవరి బ్యాంకు సెలవుల జాబితా ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే నెలలో బ్యాంకులకు పది రోజులు సెలవులున్నాయి. వీటిల్లో శని, ఆదివారాలు కలిపి ఉన్నాయి. అయితే బ్యాంకులకు పది రోజులపాటు సెలవులునప్పటికీ ఆన్‌లైన్ ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. ఆన్‌లైన్ సేవలను కస్టమర్లకు వినియోగించుకోవచ్చు.ఆర్బీఐ జారీ చేసిన ఫిబ్రవరి సెలవుల జాబితా దేశవ్యాప్తంగా ఒకేలా ఉండదు. రాష్ట్రాల్ని బట్టి మారుతూ ఉంటుందనేది గమనించాలి. ఇందులో పబ్లిక్ హాలిడేస్‌తో పాటు ప్రాంతీయ హాలిడేస్ కూడా ఉన్నాయి.
2023, ఫిబ్రవరి లో బ్యాంకుల సెలవుల జాబితా
ఫిబ్రవరి 5 - ఆదివారం
ఫిబ్రవరి 11- రెండో శనివారం
ఫిబ్రవరి 12 - ఆదివారం
ఫిబ్రవరి 15 - ఇంఫాల్‌లో సెలవు
ఫిబ్రవరి 18 -ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, బేలాపుర్, భోపాల్,
భువనేశ్వర్, రాయ్‌పూర్, రాంచీ, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, తిరువనంతపురం, కొచ్చి, లక్నో,
నాగ్‌పూర్, షిమ్లా, శ్రీనగర్‌లో మహా శివరాత్రి సెలవు
ఫిబ్రవరి 19 - ఆదివారం
ఫిబ్రవరి 20 - మిజోరాంలో సెలవు
ఫిబ్రవరి21-సిక్కింలో లోసార్ సెలవు
ఫిబ్రవరి 25 -నాలుగో శనివారం
Comments
Please login to add a commentAdd a comment