న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థలు (సీపీఎస్‌ఈ) తమ దగ్గర ఉండే మిగులు నిధులను ప్రైవేట్ రంగ మ్యుచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. సీపీఎస్‌ఈలు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు ఇది తోడ్పడనుంది. ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ మ్యుచువల్ ఫండ్స్‌కి చెందిన స్కీముల్లోనే సీపీఎస్‌ఈలు తమ మిగులు నిధులను ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతు లు ఉన్నాయి.
తాజాగా దీనికి సంబంధించి మార్గదర్శకాలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) సవరించింది. మహారత్న, నవరత్న, మినీరత్న సీపీఎస్‌ఈలు సెబీ నియంత్రిత ఫండ్స్ నిర్వహించే డెట్ స్కీముల్లో పెట్టుబడులు పెట్టొచ్చని పేర్కొంది. సీపీఎస్‌ఈలు, ఫండ్‌లు, ప్రైవే ట్ రంగ బ్యాంకుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేర కు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీపం వివరించింది.
నిర్వహణ వ్యయాలు, పన్నుల చెల్లింపులు, వ ర్కింగ్ క్యాపిటల్, వడ్డీలు, పెట్టుబడి వ్యయాలు మొదలైనవన్నీ పోగా సీపీఎస్‌ఈ దగ్గర ఉండే నిధులను మిగులు నిధులుగా పరిగణిస్తారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం మ్యుచువల్ ఫండ్స్‌తో పాటు ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, టర్మ్ డిపాజిట్లు మొదలైన వాటిలో సీపీఎస్‌ఈలు ఇన్వెస్ట్ చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment