CPSE
-
ప్రైవేట్ డెట్ ఫండ్స్‌లోకి సీపీఎస్ఈల మిగులు నిధులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థలు (సీపీఎస్ఈ) తమ దగ్గర ఉండే మిగులు నిధులను ప్రైవేట్ రంగ మ్యుచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. సీపీఎస్ఈలు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు ఇది తోడ్పడనుంది. ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ మ్యుచువల్ ఫండ్స్‌కి చెందిన స్కీముల్లోనే సీపీఎస్ఈలు తమ మిగులు నిధులను ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతు లు ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి మార్గదర్శకాలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) సవరించింది. మహారత్న, నవరత్న, మినీరత్న సీపీఎస్ఈలు సెబీ నియంత్రిత ఫండ్స్ నిర్వహించే డెట్ స్కీముల్లో పెట్టుబడులు పెట్టొచ్చని పేర్కొంది. సీపీఎస్ఈలు, ఫండ్లు, ప్రైవే ట్ రంగ బ్యాంకుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేర కు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీపం వివరించింది. నిర్వహణ వ్యయాలు, పన్నుల చెల్లింపులు, వ ర్కింగ్ క్యాపిటల్, వడ్డీలు, పెట్టుబడి వ్యయాలు మొదలైనవన్నీ పోగా సీపీఎస్ఈ దగ్గర ఉండే నిధులను మిగులు నిధులుగా పరిగణిస్తారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం మ్యుచువల్ ఫండ్స్‌తో పాటు ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, టర్మ్ డిపాజిట్లు మొదలైన వాటిలో సీపీఎస్ఈలు ఇన్వెస్ట్ చేయొచ్చు. -
ప్రభుత్వానికి దన్ను: ఓఎన్జీసీ భారీ డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్‌వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్‌వర్త్‌లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
కేంద్రానికి ఓఎన్జీసీ రూ.5,001 కోట్ల డివిడెండు
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్‌వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్‌వర్త్‌లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
విస్తరణపై ‘ప్రైవేట్’ దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్మెంట్కు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ)లలో పెట్టుబడి అవకాశాలపై ప్రయివేట్ రంగం దృష్టి సారించాల్సి ఉందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆర్థిక నిర్వహణగా కాకుండా సంస్కరణల కోణంలో చూడవలసిందిగా సూచించారు. కార్పొరేట్ సుపరిపాలన కారణంగా సీపీఎస్ఈలు మెరుగైన పనితీరు చూపుతున్నాయని తెలిపారు. దీంతో వాటాదారులకు సీపీఎస్ఈ షేర్లు స్టాక్ మార్కెట్ ఇండెక్సులతో పోలిస్తే అత్యుత్తమ రిటర్నులు(లాభాలు) అందిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ కంపెనీలు వృద్ధి బాటలో సాగడంతోపాటు దేశ, విదేశాలలో క్లిష్టతరహా బిజినెస్‌లను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తి పెంపు, ఉద్యోగ సృష్టి తదితర లబ్దిని చేకూర్చగల విస్తరణ అంశాలకు ప్రయివేట్ రంగం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సొంత సామర్థ్యాలపై సందేహాలు పెట్టుకోకుండా సంకోచాలు వీడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవలసిందిగా దేశీ కార్పొరేట్లకు మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో పాండే అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యూహాత్మక విక్రయానికి దీపమ్ సుమారు ఏడు ప్రభుత్వ రంగ కంపెనీలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ), కంటెయినర్ కార్పొరేషన్(కంకార్), వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్, ఎన్ఎండీసీకి చెందిన నాగర్నార్ స్టీల్ ప్లాంట్, హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్ త్వరలో ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్‌కు వీలుగా త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు తెరతీయనున్నట్లు దీపమ్ కార్యదర్శి పాండే వెల్లడించారు. బ్యాంక్ వ్యూహాత్మక విక్రయానికి 2021 మే నెలలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్‌గా ఉన్న బీమా రంగ పీఎస్‌యూ ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ప్రాథమిక బిడ్స్‌కు ఆహ్వానం పలికేముందు ప్రభుత్వం, ఎల్ఐసీ ఎంతమేర వాటాలు ఆఫర్ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పాండే తెలియజేశారు. ఫిక్కీ సీఏపీఏఎమ్ 2022 నిర్వహించిన 19వ వార్షిక క్యాపిటల్ మార్కెట్ సదస్సులో పాండే ఈ విషయాలు పేర్కొన్నారు. -
2014 నుంచి 96 కొత్త సీపీఎస్ఈలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి కొత్తగా 96 కంపెనీ(సీపీఎస్ఈ)లను ఏర్పాటు చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం వీటిలో అత్యధికం ఢిల్లీ కేంద్రంగా ఆవిర్భవించాయి. 69 సీపీఎస్ఈల రిజిస్టర్డ్ కార్యాలయాలు ఢిల్లీలో నమోదయ్యాయి. జాబితాలో 2018లో ఏర్పాటైన ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్) సైతం కలసి ఉంది. విమానయాన దిగ్గజం ఎయిరిండియా ప్రయివేటైజేషన్‌లో భాగంగా కంపెనీకి చెందిన కీలకంకాని ఆస్తులు, లయబిలిటీలను విడదీసి ఏఐఏహెచ్ఎల్ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ బాటలో 2016లో సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ, 2018లో బీఎస్ఎన్ఎల్ టవర్ కార్పొరేషన్, 2020లో ఐటీపీవో సర్వీసెస్, ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్, కంకార్ లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ లిమిటెడ్‌లను సైతం నెలకొల్పింది. 256 కంపెనీలు.. 2020లోనే ఎన్టీపీసీ రెనవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఎన్ఎస్ఐసీ వెంచర్ క్యాపిటల్ ఫండ్, రాజ్‌గఢ్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ ఆవిర్భవించినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించాయి. మూడు సీపీఎస్ఈలు చొప్పున చత్తీస్‌గఢ్, యూపీలో నెలకొల్పగా.. జార్ఖండ్‌లో డియోఘఢ్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌సహా నాలుగు సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. కర్ణాటకలో ఐదు, కేరళలో మూడు, మహారాష్ట్ర, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లలో రెండు, పంజాబ్, తెలంగాణలో ఒకటి చొప్పున కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020 మార్చి31కల్లా 256 సీపీఎస్ఈలు మనుగడలో ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి. వీటిలో 171 లాభాలు ఆర్జిస్తుంటే, 84 నష్టాల్లో ఉన్నట్లు వెల్లడించాయి. -
కేంద్రానికి రూ.16,517 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.16,517.24 కోట్ల డివిడెండ్ లభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. తాజాగా సెయిల్ నుంచి రూ.483 కోట్లు, మాంగనీస్ ఓర్ ఇండియా నుంచి రూ.63 కోట్లు, ఎంఎస్టీసీ నుంచి రూ.20 కోట్ల డివిడెండ్ అందినట్లు తుహిన్ కాంత పాండే వివరించారు. -
అధిక డివిడెండ్లపై సర్కారు ఆశలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో ఖజానా ఆదాయానికి గండి పడే అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) చెల్లించే డివిడెండ్లపై కేంద్రం ఆశలు పెట్టుకుంది. వీలైనంత అధికంగా, సాధ్యమైనంత త్వరగా డివిడెండ్లు చెల్లించాలంటూ పీఎస్‌యూలకు సూచించింది. త్రైమాసికాలవారీగా చెల్లించేయాలంటూ కాస్త పటిష్టంగా ఉన్న సంస్థలను ఆదేశించింది. కనీస పరిమాణం చెల్లించాలన్న నిబంధనలను పట్టుకుని కూర్చోకుండా సాధ్యమైనంత ఎక్కువగా చెల్లించేందుకు కృషి చేయాలని పేర్కొంది. దీనివల్ల విడతలవారీగా వచ్చే డివిడెండుపై కాస్త అంచనాకు వచ్చేందుకు, తగు ప్రణాళికలు వేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. పెట్టుబడులు, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు అన్ని పీఎస్‌యూల అధిపతులకు లేఖలు పంపింది. ‘‘మిగతావాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా డివిడెండ్లు చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ).. త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రతీ త్రైమాసికంలో మధ్యంతర డివిడెండ్ చెల్లించే అంశాలను పరిశీలించాలి. మిగతా సీపీఎస్ఈలు అర్ధ సంవత్సరానికోసారి మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించవచ్చు. ఇక డివిడెండ్ చెల్లింపునకు పెద్దగా అవకాశం లేని సంస్థలు .. వార్షికంగా కట్టే అంశం పరిశీలించవచ్చు. రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన తర్వాత తమ తమ అంచనాల ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌లో కట్టవచ్చు’’ అని పేర్కొంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక అంచనాల్లో కనీసం 90 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా విడతలవారీగా మధ్యంతర డివిడెండ్ కింద కట్టడంపై దృష్టి పెట్టాలని దీపం సూచించింది. ప్రస్తుతం ఆఖర్లో చెల్లింపులు .. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత నిబంధనల ప్రకారం తమ లాభాల్లో 30 శాతం లేదా నికర విలువలో 5 శాతం మేర కనీస డివిడెండ్‌ను చెల్లిస్తున్నాయి. చాలా మటుకు కంపెనీలు సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తుంటాయి. అయితే, ఇలా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో చెల్లించేటప్పుడు ... ఇతరత్రా సరఫరాదారులకు, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు మొదలైన వాటికి కూడా చేతిలో ఉన్న నిధులనే సర్దుబాటు చేయాల్సి వస్తుండటం .. కంపెనీలకు సమస్యాత్మకంగా మారుతోందని దీపం అభిప్రాయపడింది. చివర్లో కాకుండా ముందు నుంచీ కొంత కొంతగా చెల్లించడం వల్ల ఇలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఇక స్థిరమైన డివిడెండ్ విధానమంటూ ఉంటే ఇన్వెస్టర్లకు కూడా సీపీఎస్ఈ షేర్లపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొంది. ‘‘తరచుగా లేదా మూణ్నెల్లకోసారి డివిడెండ్లు చెల్లిస్తున్న పక్షంలో నాణ్యమైన ఇన్వెస్టర్లు.. ఆయా సంస్థల స్టాక్స్‌పై ఆసక్తి చూపవచ్చు. భవిష్యత్ డివిడెండ్లపై ఆశతో వాటిని అట్టే పెట్టుకుని కూడా ఉండవచ్చు’’ అని దీపం తెలిపింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వల్లే తాజా ఆదేశాలు తెరపైకి వచ్చి ఉంటాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధానంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులే దీనికి కారణం. పీఎస్‌యూలు ఒకేసారి గాకుండా రెండు లేదా నాలుగు విడతల్లో గానీ చెల్లిస్తే అవి నగదును మెరుగ్గా నిర్వహించుకోగలవు. అలాగే, ప్రభుత్వం తన రుణ అవసరాలను బేరీజు వేసుకునేందుకు వీలుంటుంది. రుణ సమీకరణ ప్రణాళికలను అర్ధాంతరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బాండ్ మార్కెట్‌పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండదు’’ అని పేర్కొన్నారు. పీఎస్‌యూలకు ఆర్థికంగా ప్రతికూలం.. మరింత ఎక్కువగా డివిడెండ్ చెల్లించేలా ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి పెంచితే వాటి ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అధిక డివిడెండ్ చెల్లింపుల కారణంగా అవి తమ పెట్టుబడి వ్యయాల కోసం మరింతగా రుణాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి మరింత ఎక్కువ డివిడెండ్ చెల్లించే పరిస్థితిలో కూడా పీఎస్‌యూలు లేవని తెలిపారు. గడిచిన అయిదేళ్లలో ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, వంటి దిగ్గజాలు తమ లాభదాయకత తగ్గుతూ, రుణభారం పెరుగుతూ ఉన్నప్పటికీ డివిడెండ్లను అదే స్థాయిలోనో లేదా అంతకు మించే చెల్లిస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో 55 లిస్టెడ్ పీఎస్‌యూలు రూ. 82,750 కోట్ల లాభాలపై రూ. 47,000 కోట్ల మేర డివిడెండ్ చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో నమోదైన 70% పోలిస్తే ఇది కాస్త తగ్గి 57 శాతానికే పరిమితమైనప్పటికీ.. మిగతా కార్పొరేట్లతో పోలిస్తే మాత్రం ఎక్కువే. నిఫ్టీ50 సూచీలోని టాప్ సంస్థలు తమ లాభాల్లో సగటున 45% మాత్రమే చెల్లించాయి. అదే అయిదేళ్ల వ్యవధిలో చూస్తే ఈ 55 సంస్థలు సుమారు రూ. 3.85 లక్షల కోట్ల లాభాలపై మొత్తం రూ. 2.75 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించాయి. అంటే రికార్డు స్థాయిలో లాభాల్లో ఏకంగా 71.5% చెల్లించాయి. నిఫ్టీ 50 సంస్థలు చెల్లించిన దానికి (32 శాతం) ఇది రెట్టింపు. ఇవి కాకుండా షేర్ల బైబ్యాక్‌ల రూపంలోనూ ప్రభుత్వానికి పీఎస్‌యూలు గణనీయంగా చెల్లించాయి. -
రీట్స్ ద్వారా సీపీఎస్ఈ స్థలాల విక్రయం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థలాల విక్రయానికి రీట్స్ విధానాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా శతృ ఆస్తుల విక్రయానికి కూడా రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్) విధానాన్ని ఉపయోగించుకునే విషయాన్ని సదరు శాఖ పరిశీలిస్తోంది. రీట్స్ విధానంపై ఆర్థిక శాఖ చూపు.... వ్యూహాత్మక విక్రయం కోసం గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను కేంద్రం విక్రయించనున్నది. ఈ ఆస్తులను పూర్తిగా అమ్మేయడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ, లేదా రీట్స్ విధానాన్ని గానీ చేపట్టాలని ఆర్థిక శాఖ యోచిస్తోంది. అలాగే శతృ స్థిరాస్తుల విక్రయానికి రీట్స్‌ను పరిశీలించాలని సదరు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పాకిస్తాన్, లేదా చైనా దేశాలకు వలస వెళ్లి భారత పౌరసత్వం కోల్పోయిన పౌరుల ఆస్తులను శతృ ఆస్తులుగా పరిగణిస్తారు. శతృ ఆస్తులకు కస్టోడియన్‌గా హోమ్ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది. 2014లోనే రీట్స్ నిబంధనలు... రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ 2014లోనే రూపొందించినా, ఇవి ఇంకా ప్రాచుర్యం పుంజుకోలేదు. ఇటీవలనే ఎంబసీ ఆఫీస్ పార్క్స్ సంస్థకు చెందిన రీట్ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్, అమెరికాకు చెందిన ప్రముఖ పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌లు సంయుక్తంగా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. రూ.300 ఇష్యూ ధరతో ఇటీవలనే ఐపీఓకు వచ్చిన ఈ సంస్ట్ రీట్ ఇప్పుడు రూ.337 ధర వద్ద ట్రేడవుతోంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా రీట్స్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. రీట్స్ విధానంలో స్థలాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. -
సీపీఎస్ఈ ఈటీఎఫ్‌కు రూ.27,300 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: సీపీఎస్ఈ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా కేంద్రం రూ.17,000 కోట్లకు పైగా సమీకరించనుంది. దేశీయంగా ఒక ఈటీఎఫ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న ఆరంభమైన ఈ ఆఫర్ శుక్రవారం ముగిసింది. దీనికి మొత్తం 1.25 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.27,300 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటా యించిన వాటా 5.5 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ కేటగిరీ ఇన్వెస్ట్రర్ల నుంచి రూ.13,300 కోట్లకు బిడ్లు వచ్చాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ.17,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,200 కోట్ల మేర బిడ్లు వచ్చాయి. ప్రావిడెండ్ ఫండ్ సంస్థ, ఈపీఎఫ్ఓ రూ.1,500 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో 11 కంపెనీల షేర్లున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, ఆర్ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, ఎస్‌జేవీఎన్, ఎన్ఎల్సీ, ఎన్‌బీసీసీల షేర్లు ఈ ఈటీఎఫ్‌లో ఉన్నాయి. -
కేంద్రానికి రూ.14,000 కోట్ల ఈటీఎఫ్ నిధులు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం సీపీఎస్ఈ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ నాలుగో విడత జారీ ద్వారా రూ.14,000 కోట్లను సమీకరించనున్నట్టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. గత మూడు విడతల జారీల్లో కేంద్ర మొత్తం మీద రూ.11,500 కోట్ల మేర సమీకరించింది. నాలుగో విడత ఇష్యూ వచ్చే వారం ప్రారంభం అవుతుందని, ఇన్వెస్టర్లకు 3.5–4 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం రూ.8,000 కోట్ల వరకు సమీకరించాలనుకుంటోందని, అవసరమైతే రూ.4,000– 6,000 కోట్ల మేర అదనంగా సమీకరించే గ్రీన్ షూ ఆప్షన్ కూడా కలిగి ఉంటుందని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కూడిన ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇది. ఇందులో గతంలో 10 కంపెనీలు ఉండగా తాజాగా వీటి సంఖ్య 11కు చేరింది. కొత్తగా ఎన్టీపీసీ, ఎస్‌జేవీఎన్, ఎన్ఎల్సీ, ఎన్బీసీసీ వచ్చి చేరాయి. ఇప్పటికే ఉన్న గెయిల్, ఇంజనీర్స్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్‌ను ఇండెక్స్ ఫండ్ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 55 శాతం లోపునకు తగ్గిపోవడంతో ఈ చర్య తీసుకుంది. ఇక సీపీఎస్ఈ ఈటీఎఫ్‌లో మిగిలిన ఇతర కంపెనీలు... ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, ఆర్ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్. దీన్ని తొలిసారిగా 2014లో కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణలతో రూ.80,000 కోట్లు సమీకరించాలన్నది సర్కారు లక్ష్యం. -
ప్రభుత్వ సంస్థల్లో షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్లు బైబ్యాక్ చేసేందుకు దాదాపు పదకొండు ప్రభుత్వ రంగ సంస్థలను (సీపీఎస్ఈ) కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్ఎండీసీ, ఎన్ఎల్సీ, భెల్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్బీసీసీ, ఎస్‌జేవీఎన్, కేఐవోసీఎల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఈ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఇటీవలే ఆయా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ లిస్టును రూపొందించింది. అయితే, ఆయా సంస్థల వ్యాపార ప్రణాళికలను బట్టి చూస్తే.. అన్ని సంస్థలు 2018–19లోనే షేర్ల బైబ్యాక్ చేయలేకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2016 మే 27 నాటి పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాలకి ప్రకారం కనీసం రూ. 2,000 కోట్ల నికర విలువ, రూ. 1,000 కోట్ల పైగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సీపీఎస్ఈలు తప్పనిసరిగా షేర్ల బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా షేర్లు బైబ్యాక్ చేయాలంటూ ఈ సీపీఎస్ఈలకు కేంద్రం సూచించింది. కంపెనీ సంపదలో కొంత భాగాన్ని షేర్హోల్డర్లకు బదలాయించేందుకు, షేర్లు ధరలకూ ఊతం ఇచ్చేందుకు సంస్థలు.. షేర్ల బైబ్యాక్ చేపడుతుంటాయి. ఇలా కొన్న షేర్లను రద్దు చేయడం లేదా ట్రెజరీ స్టాక్ కింద వర్గీకరించడం చేస్తాయి. చలామణీలో ఉన్న షేర్లు తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన మరింత పెరిగి ఆయా సంస్థల వ్యాపారం ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. -
సీపీఎస్ అంతం..మా పంతం
ఒంగోలు: ఫ్యాప్టో (ఫెడరేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపునకు స్పందించి ఉద్యోగ జేఏసీ కూడా సంఘీభావం ప్రకటించింది. మరో వైపు వేలాదిమంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సెలవులు పెట్టుకొని ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో సివిల్ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ప్రకాశం భవనం వద్ద పెద్ద ఎత్తున మొహరించారు. మహిళా ఉపాధ్యాయినులు ఎక్కువగా హాజరుకావడంతో పోలీసులు సైతం ఏం చేయాలో అర్థంకాక ఒక వైపు బ్యారికేడ్లు ఏర్పాటుచేసి ప్రకాశం భవనం ముందు ఉన్న రెండు రోడ్లలో ఒక రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. దీంతో ఉపాధ్యాయులు చేపట్టిన ముట్టడి కార్యక్రమం విజయవంతం అయింది. 9 గంటలకే తరలి వచ్చిన ఉపాధ్యాయులు: ఉద్యోగులు 10 గంటలకల్లా ప్రకాశం భవనంలోకి చేరుకుంటారని, అందుకు అనుగుణంగా 9 గంటలకే పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు చేరుకున్నారు. ప్రకాశం భవనం రెండు గేట్ల వద్ద బైఠాయించి సీపీఎస్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. పదిగంటలైనా ఒక్క ఉద్యోగి కూడా కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా ప్రకాశం భవనం అన్ని గేట్ల ముందు ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఆందోళనకు ఉద్యోగ జేఏసీ కూడా సంఘీభావం ప్రకటించింది. ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికుల భద్రతకు సవాల్‌గా మారిందన్నారు. పెన్షన్ అనేది ప్రభుత్వం భిక్ష కాదని, అది ఉద్యోగుల సామాజిక హక్కు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల్‌రెడ్డి ఇచ్చిన తీర్పును ఉదహరించారు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండూ సీపీఎస్ కొనసాగించేందుకు మొగ్గు చూపుతూ ఉద్యోగులను దగా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. 5వ తేదీ చలో పార్లమెంట్ కార్యక్రమం ద్వారా సీపీఎస్ రద్దుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులు మిక్కిలిగా కదలిరావాలన్నారు. 22వ తేదీ తరువాత దశలవారీ కార్యాచరణ కూడా ప్రకటిస్తారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దుచేస్తే సరి..లేదంటే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శరత్‌బాబు మాట్లాడుతూ ఎంఎల్ఏ, ఎంపీలుగా ఒక్కసారి ఎన్నికైన వారికి జీవితాంతం పెన్షన్, ఆరోగ్య భద్రతతోపాటు అనేక రకాలైన ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందని, కానీ 30 నుంచి 40 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో కొనసాగిన వారికి మాత్రం పెన్షన్ ఇవ్వకపోవడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వాలు స్పష్టం చేయాలన్నారు. సీపీఎస్ రద్దుకు ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు అయితే ముందుకు వస్తాయో వారికే భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మూడు గంటలపాటు ప్రకాశం భవనం గేట్ల వద్దే బైఠాయింపు: ప్రాథమిక సమాచారం ప్రకారం 14 వేల మంది ఉపాధ్యాయులకుగాను దాదాపు 5 వేల మందికిపైగా ఉపాధ్యాయులు శనివారం సెలవు పెట్టారు. అందులో దాదాపు మూడు వేలమంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు గంటలు దాటినా ఉపాధ్యాయులు ఆందోళన విరమించకపోవడంతో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ సురేష్‌రెడ్డి, రూరల్ సీఐ మురళీకృష్ణలు ఫ్యాప్టో నాయకులతో చర్చించారు. ఆందోళన విరమించాలని సూచించారు. ఈ క్రమంలో అరెస్టులకైనా సిద్ధమే అని, అంతే తప్ప ఆందోళన విరమించేది లేదంటూ టీచర్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆందోళనలో పాల్గొన్న సగం మంది ఉపాధ్యాయులు చర్చిసెంటర్లో మానవహారం చేపట్టారు. సీపీఎస్ వ్యవస్థకు పాడె కట్టడమే తమ లక్ష్యం అంటూ శవం మాదిరిగా ఒక ఉపాధ్యాయుడ్ని మోస్తూ ప్రదర్శన నిర్వహించారు. సీపీఎస్ అంతం ...మా పంతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో చర్చిసెంటర్లో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ క్రమంలో పోలీసుల సూచనతో ఫ్యాప్టో నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరి ఆందోళన విరమించేందుకు ఉపాద్యాయులతో మాట్లాడారు. అయితే ఉపాధ్యాయులు ఎక్కువ మంది వారి ప్రతిపాదనను తిరస్కరించారు. కలెక్టర్ వచ్చి తమతో మాట్లాడాలని పట్టుబడితే మరికొంతమంది అయితే మాత్రం సీపీఎస్‌పై స్పష్టమైన హామీ కావాలని, లేదా అరెస్టులకైనా సిద్ధమే అంటూ ప్రకటించారు. ఈ క్రమంలో కొద్దిసేపు వారి మధ్యనే కొంత వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన విరమించేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్టులకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో పలువురు నాయకులను అరెస్టుచేసి పోలీసు వాహనంలో స్టేషన్లకు తరలిస్తుండగా పెద్ద ఎత్తున ఉద్యోగులు అడ్డంపడ్డారు. చివరకు పోలీసులు బలవంతంగా పలువురిని టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మా ధర్నా సీసీఎస్ రద్దు కోసమే: ఇదిలా ఉంటే రెండోవిడత మరికొంతమంది నాయకులను అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా మహిళా ఉపాధ్యాయినులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. వారిని బలవంతంగా మహిళా పోలీసులు తొలగించేందుకు చేసిన యత్నం ఫలించలేదు. దీంతో టూటౌన్ సీఐ జోక్యం చేసుకుంటూ మహిళా ఉపాధ్యాయినులతో మాట్లాడారు. సీపీఎస్ «ఆందోళన ఇందాకే ముగిసింది. ఇప్పుడు మీరు చేస్తున్న ఆందోళన పోలీసులకు వ్యతిరేకంగా అంటూ మండిపడ్డారు. అయితే ఈ సమయంలో మహిళా ఉపాధ్యాయినులు కూడా ఏమాత్రం బెదరకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పోలీసుల్లో కూడా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారని, వారి సంక్షేమం కూడా తమకు ముఖ్యమే అంటూ తిరుగు సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసులు నిరసనకారులను తాలూకా పోలీసుస్టేషన్‌కు, అనంతరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ ధర్నాలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా శ్రీనివాసరావు, పిల్లి రమణారెడ్డి, ఫ్యాప్టో నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి, రవిచంద్ర, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శీనయ్య, ఏపీటీఎఫ్ నాయకులు విజయసారథి, రఘుబాబు, మంజుల, బీటీఏ నాయకులు పర్రె వెంకట్రావు, శరత్చంద్ర, స్కూల్ అసిస్టెంట్స్ యూనియన్ నాయకులు శరత్‌బాబు, సాయి, రమణకుమార్, ఎస్టీయూ నాయకులు ప్రసాద్, ఎర్రయ్య, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ నాయకులు వై.వెంకట్రావు, తెలుగు పండిట్స్ అసోసియేషన్ నాయకులు రమేష్, వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ యూనియన్ నాయకులు చిరంజీవి, ఏపీటీఎఫ్ 1938 నాయకులు కీర్తి, మాధవరెడ్డి, పి.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
వంద రోజుల్లో వృద్ధి రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) పనితీరును బలోపేతం చేసుకుంటూ... అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టేలా 100 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను (రోడ్‌మ్యాప్) రూపొందిం చుకోవాలని ప్రధాని మోదీ నిర్ధేశించారు. ఇందుకోసం తగిన లక్ష్యాలను సిద్ధం చేసుకోవాలన్నారు. సోమవారమిక్కడ జరిగిన సీపీఎస్ఈ సదస్సులో మోదీ మాట్లాడారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) వ్యయంలో భాగంగా ఏటా నిర్ధిష్ట అంశంపై(థీమ్) ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించాలని చెప్పారాయన. సీఎస్ఆర్ కింద పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను విజయవంతంగా చేపట్టాడాన్ని ప్రశంసించారు. నీతి ఆయోగ్ గుర్తించిన 115 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి థీమ్ అని సూచించారు. నైపుణ్యాల కల్పన పథకాలను కూడా సీపీఎస్ఈలు ఎంచుకోవచ్చన్నారు. సరికొత్త భారత్ కోసం విజన్ –2020, వినూత్నతలు–సాంకేతికత, ఫైనాన్షియల్ రీ–ఇంజినీరింగ్, మానవ వనరుల నిర్వహణ, కార్పొరేట్ నైతికత వంటి అంశాలపై సదస్సులో ప్రత్యేకంగా ప్రదర్శనలను నిర్వహించారు. స్వేచ్ఛనిస్తున్నాం... పీఎస్‌యూలకు ప్రభుత్వం నిర్వహణాపరమైన స్వేచ్ఛనిస్తోందని.. దీన్ని సద్వినియోగం చేసుకుని పనితీరును మెరుగుపరచుకోవాలని ప్రధాని చెప్పారు. ‘మనకు స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి జాతి నిర్మాణం, ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎనలేని సేవలందిస్తున్నాయి. మీ (సీపీఎస్ఈలు) నుంచి నేను చాలా నేర్చుకోవాలి. మరింత సమయం వెచ్చించినట్లయితే, ఆ అనుభవాన్ని ప్రభుత్వ నిర్వహణలో ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మీరు ప్రదర్శించిన ఈ అంశాలతో సరిగ్గా 100 రోజుల్లో సరైన రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తారని భావిస్తున్నా’ అని మోదీ వ్యాఖ్యానించారు.కాగా, చిన్న, మధ్య తరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)ల నుంచి సీపీఎస్ఈలు తక్కువగా కొనుగోళ్లు చేస్తుండటం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని కొనుగోళ్లు జరపటమే కాక చెల్లింపులు కూడా సత్వరం చేయాలన్నారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని పర్యాటక ప్రాంతాల్లో తమ సదస్సులు, సమావేశాలను నిర్వహించుకోవాల్సిందిగా మోదీ సీపీఎస్ఈ యాజమాన్యాలకు సూచించారు. దీనివల్ల పర్యాటకాన్ని ప్రోత్సహించినట్లవుతుందని చెప్పారాయన. -
‘మహిళా శక్తి’కి జై!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో ‘ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళలకు చేరువై వారిలో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు కార్మిక సంఘాల్లో సభ్యులైన తమ ఉద్యోగులతో వేతన సవరణపై తదుపరి చర్చలు జరిపేందుకు కూడా అంగీకరించింది. చాలా కాలంగా పెండింగులో ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల వేతనాల పెంపు ప్రతిపాదనకు సైతం మోక్షం లభించింది. ‘బేటీ బచావో–బేటీ పడావో’ విస్తరణ 115 జిల్లాల్లో బ్లాకు స్థాయిలో 920 మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. అలాగే ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో–బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 ‘వన్‌స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఓకే చెప్పింది. విస్తృత పథకమైన ‘ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017–20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు. భారం సీపీఎస్ఈల పైనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులతో 8వ దఫా వేతన చర్చలు జరిపేందుకు రూపొందించిన విధాన ప్రక్రియకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘ఉత్పత్తితో పోలిస్తే కార్మికులకయ్యే వ్యయం పెరగకూడదన్న షరతుకు లోబడి వేతన సవరణ జరగాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం, అది కూడా సీపీఎస్ఈలు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లయితేనే, సంబంధిత పాలనా విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ను సంప్రదించిన తరువాతే వేతన పెంపు నిర్ణయం తీసుకోవాలి’ అని కేబినెట్ భేటీ తరువాత ప్రకటన వెలువడింది. ‘వేతనాలు పెరిగితే కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. ఆర్థిక భారమంతా సదరు సంస్థపైనే ఉంటుంది. ఉద్యోగుల వేతనాలు పెరిగిన తరువాత తమ ఉత్పత్తులు, సేవల ధరలు పెరగకుండా సీపీఎస్ఈలు చూసుకోవాలి. ఇలా సవరించిన వేతనాలు ఎగ్జిక్యూటివ్‌లు, అధికారులు, యూనియనేతర ఉద్యోగుల వేతనాలను మించకూడదు’ అని అన్నారు. తమకున్న ఆర్థిక వనరులు, చెల్లించే స్తోమత ఆధారంగా వేతన సవరణపై కార్మికులతో చర్చలు జరిపేందుకు ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. సవరించిన వేతనాలు 2017, జనవరి నుంచి అమల్లోకి వచ్చి ఐదేళ్లు లేదా పదేళ్లు (ఏది ఎంచుకుంటే అది) వర్తిస్తాయి. అటవీయేతర ప్రాంతాల్లో పెంచిన వెదురు చెట్లను నరికేయకుండా సంబంధిత చట్టంలో సవరణ చేసేలా ఆర్డినెన్స్ తేవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సీజేఐ వేతనం రూ.2.80 లక్షలు సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. -
ఒక్కమాట.. వెలుగు రేఖ
‘ఉద్యోగ విరమణ తర్వాత పెన్షనర్లు ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక సమస్యలు లేకుండా జీవించడానికి పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం అందుబాటులోని వనరులతో ఏర్పాటు చేయాలి’. సుప్రీంకోర్టు 1982లో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇచ్చిన తీర్పు ఇది. అయితే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గిన ప్రభుత్వాలు పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని 2013లో (సీపీఎస్) అమలులోకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి ఈ స్కీమ్ పరిధిలోకి వస్తారు. ఈ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించ లేదు. ఈ క్రమంలో తాను అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు పాత పింఛన్ విధానం అమలులోకి తెస్తానని హామీ ఇచ్చారు. సీపీఎస్ స్కీమ్ రద్దవుతే జిల్లాలో దాదాపు 12 వేల మంది లబ్ధిపొందుతారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా హామీ ప్రకటించడంతో పలు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప ఎడ్యుకేషన్/బద్వేల : ఆర్థిక భరోసా ఉన్నట్టే సీపీఎస్ స్కీమ్ రద్దు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంద ని చెప్పడం అవాస్తవం. సీపీఎస్ రద్దవుతే లక్షల మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా కలుగుతుంది. జగన్ నిర్ణయాన్ని ఎంతో మంది స్వాగతిస్తున్నారు. మడితాటి నరసింహా రెడ్డి, హెచ్ఎం, రాయచోటి ఉపాధ్యాయులు అండగా ఉంటారు సీపీఎస్ రద్దుపై హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉపాధ్యాయులు అండగా ఉంటారు. కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నా అధికారంలో ఉన్న వారిలో ఒక్కరూ కూడా స్పందించలేదు. ఇప్పటికే ఎంతో మంది నష్టపోయారు. సీపీఎస్ రద్దుకు సహకరిస్తే వారికి రుణపడి ఉంటాం. భాస్కర్, ఉపాధ్యాయుడు, రాయచోటి చారిత్రాత్మకంగా నిలుస్తోంది సీపీఎస్ రద్దుపై జగన్ ఇచ్చిన హామీ అమలు అయితే చరిత్రలో నిలిచిపోతోంది. ఉద్యోగుల కష్టాలు చూసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. - రాజగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, బి.కోడూరు మండలం ఆశలకు ఊపిరి పోశారు పాత పింఛను విధానాన్ని ప్రవేశపెడతామని వైఎస్ జగన్ చెప్పిన ఒక్క మాటతో లక్షలాది ఉద్యోగుల ఆశలకు ఊపిరి పోశారు. ఎన్నో ఏళ్లుగా సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం ప్రవేశపెట్టాలని నాయకులను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నా పట్టించుకోలేదు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ హామీ ఇవ్వడం అభినందనీయం. - సుజానేంద్ర, జూనియర్ అసిస్టెంట్, కలసపాడు పదవ రత్నంగా ప్రకటించాలి ఇప్పటికే వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పిన హామీని పదవ రత్నంగా పేర్కొనవచ్చు. సీపీఎస్ రద్దు చేస్తే రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపడమే. – లెక్కల జమాల్‌రెడ్డి, పీఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భరోసా కల్పించారు సీపీఎస్ స్కీమ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో వైఎస్ జగన్ భరోసా కల్పించేలా సానుకూల నిర్ణయంపై హామీ ఇవ్వడం హర్షనీయం. ఈ విషయంపై మిగతా పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. – మల్లు. రఘనాథరెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్‌పై నమ్మకం ఉంది అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను జగన్ రద్దు చేస్తారనే నమ్మకం ఉంది. అన్ని వర్గాల మేలు కోరే నాయకుడు కష్టాలు తెలుసుకుని స్పందిస్తారు. ఆ మేరకే జగన్ కూడా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. – జనార్దన్‌రెడ్డి, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు చొరవ చూపలేదు అధికారంలో ఉండటంతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీపీఎస్ రద్దుకు చొరవ చూపలేదు. ఇటీవల తిరుపతిలో జరిగిన సమావేశంలో విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే కేంద్రం పరిధిలో ఉందని చెప్పి తప్పించుకున్నారు. జగన్ ప్రకటనను ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. – పీవీ రమణరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
ఆ ‘డబ్బు’ను ప్రభుత్వం వద్దే ఉంచండి
సీపీఎస్ఈ ఉద్యోగులకు డీవోపీటీ ఆదేశం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో (సీపీఎస్ఈ) పనిచేసే ఉద్యోగులందరూ..సీపీఎస్ఈల అనుబంధ, సంయుక్త సంస్థలలో విధులు నిర్వహిస్తున్నపుడు వారి సేవలకు సదరు సంస్థల నుంచి పొందే సిట్టింగ్ ఫీజులు, బోనస్‌లు, లాభాలు–షేర్లలో వాటాలు వంటి ధన సంబంధమైన అదనపు ప్రయోజనాలన్నింటినీ ప్రభుత్వం దగ్గరే డిపాజిట్ చేయాలి. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేస్తూ అన్ని మంత్రిత్వ శాఖలను వారి ఉద్యోగుల్లో దీనిపై అవగాహన కల్పించాలని కోరింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, పంక్షనల్ డైరెక్టర్లు సహా ఎవరైనా ఇప్పటికే ఇలాంటి అదనపు ప్రయోజనాలు పొంది ఉంటే, వాటిని తమ మాతృసంస్థ దగ్గరే డిపాజిట్ చేయాలని చెప్పింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఏ ఉద్యోగి సేవలనైనా, ఏ విధంగా అయినా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందనీ, అందుకోసం ఉద్యోగులు అదనపు పారితోషికం అడగకూడదని ప్రభుత్వ సంస్థల విభాగం (డీపీఈ) నిబంధనల్లో పేర్కొంది. -
ఖాయిలా సంస్థల మూసివేతకు నియమావళి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో ఖాయిలా పరిశ్రమల (సీపీఎస్ఈ) మూసివేతకు కేంద్రం మార్గదర్శకాలను జారీచేసింది. చరాస్తులు, భూముల విక్రయం, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)ను కోరుకోని ఉద్యోగుల తొలగింపు వంటి అంశాలకు సంబంధించి కాలపరిమితిని ప్రభుత్వ సంస్థల శాఖ (డీపీఈ) జారీ చేసిన నియమావళి నిర్దేశించింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ⇔ 74 ఖాయిలా పరిశ్రమలను నీతీ ఆయోగ్ గుర్తించింది. ఇందులో 26 సంస్థల మూసివేతకు సిఫారసులు జరిగాయి. ⇔ స్థిర, చర ఆస్తుల విక్రయ బాధ్యతలను భూ నిర్వహణ, వేలం సంస్థలకు అప్పగిస్తారు. ⇔ వీఆర్ఎస్కు అంగీకరించని ఉద్యోగుల తొలగింపు జీరో డేట్ (మూసివేతకు మినిట్స్ జారీ అయిన తేదీ) నుంచి నాలుగు నెలల్లో పూర్తికావల్సి ఉంటుంది. ⇔ జీరో డేట్ నుంచి మూడు నెలల్లో వేతన ఇతర చట్టబద్ద బకాయిల అంశాల పరిష్కారం జరగాలి. ⇔ ఇదే మూడు నెలల్లో ఆదాయపు పన్ను శాఖకు చేయాల్సిన చెల్లింపులూ జరిగిపోవాలి. ⇔ రుణ దాతల బకాయి చెల్లింపులు 2 నెలల్లో పూర్తి కావాలి. ⇔ సంబంధిత పరిశ్రమ భూ అమ్మకాలు ఆరు నెలల్లో జరగాలి. ఈ ఆస్తుల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను తొలి ప్రాధాన్యత ఉంటుంది. అటు తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ప్రాధాన్యత ఇస్తారు. ⇔ జీరో డేట్ నుంచి ఆరు నెలల్లో కొనుగోళ్లకు ఏ సంస్థ నుంచీ డీపీఏకు ప్రతిపాదన అందకపోతే, నియమనిబంధనలకు లోబడి ఒక వేలం సంస్థకు ఈ బాధ్యతల అప్పగింత జరుగుతుంది. -
ఆర్థికాభివృద్ధిలో పీఎస్‌యూలు కీలకం
♦ మిగులు నిధులు, వనరులు ♦ సద్వినియోగం కావాలి: రాష్ట్రపతి ప్రణబ్ ♦ వృద్ధి, ఉపాధి కల్పనలకు ఇది అవసరమని వ్యాఖ్య ♦ స్కోప్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) మిగులు భూమి, నిధులు ఇతర వనరులు సద్వినియోగం కావాలని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఈ దిశలో ఆయా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది సంస్థల మూలధన పటిష్టతకే కాకుండా... దేశ ఆర్థికాభివృద్ధి మెరుగుదలకు, ఉపాధి కల్పన అవకాశాలు పెరగడానికి దోహదపడుతుందని విశ్లేషించారు. దేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. పబ్లిక్ సెక్టార్ డే ఉత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రభుత్వ రంగ సంస్థల- అత్యున్నత మండలి స్కోప్ (స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్) ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక ప్రముఖులకు స్కోప్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర.... 2013-14తో పోల్చితే 2014-15లో ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లింపు మూలధనం, ఉపయోగించిన మూలధనంలో 7 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడుల్లో 10.5 శాతం, మొత్తం మార్కెట్ కేపిటలైజేషన్ విషయంలో 20 శాతం వృద్ధి నమోదయ్యిందని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. 2012-13 నుంచి 2014-15 వరకూ మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తంగా రూ.1,15,426 కోట్ల లాభాలను ఆర్జించాయి. స్థూల టర్నోవర్ రూ.20,02,591 కోట్లు. డివిడెండ్ చెల్లింపులు రూ.57,115 కోట్లు. ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంత కీలకమైనదన్న విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనితో పాటు స్వచ్ఛభారత్ ఆభియాన్లో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర కీలకమైనది. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యతల విషయంలో ప్రభుత్వరంగ సంస్థలు నిరుపమాన సేవలు అందిస్తున్నాయి. -
అక్టోబర్ కల్లా మలి విడత సీపీఎస్ఈ ఈటీఎఫ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో రూపొందించిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (సీపీఎస్ఈ-ఈటీఎఫ్)ను అక్టోబర్ నాటికి మరో దఫా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు పుష్కలంగా నిధులు ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో), నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు కల్పించనుంది. దీపావళి లోగా ఈ న్యూ ఫండ్ ఆఫర్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని, ఇందులో స్టాక్స్ యథాతథంగానే ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2014లో ప్రభుత్వం తొలిసారిగా 10 పీఎస్‌యూల స్టాక్స్‌తో సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ను ప్రవేశపెట్టినప్పుడు రూ. 3,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ. 10 ముఖవిలువ ఉండే ఈటీఎఫ్ యూనిట్లలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు కనిష్టంగా రూ. 5,000- గరిష్టంగా రూ. 10 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. -
ప్రభుత్వ ఈటీఎఫ్‌లో యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్ఈ ఈటీఎఫ్)లో సంస్థాగత(యాంకర్) ఇన్వెస్టర్లు రూ. 850 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన పది బ్లూచిప్ కంపెనీల వాటాలతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్‌ను మంగళవారం ప్రవేశపెట్టగా, తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు. ఈటీఎఫ్ ద్వారా మొత్తం రూ. 3,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు, యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 900 కోట్ల యూనిట్లను రిజర్వ్ చేసింది. కాగా, బుధవారం నుంచీ ఈటీఎఫ్ యూనిట్ల కొనుగోలుకి రిటైలర్లు తదితర ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో కనీసం రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా, ఆరు సంస్థలు బిడ్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫర్ ఈ నెల 21న ముగియనుంది. ఓఎన్జీసీ, ఐవోసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్, పీఎఫ్సీ, ఆర్ఈసీ తదితర 10 సంస్థల వాటాలతో ఈ ఫండ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఇన్వెస్టర్లకూ ప్రభుత్వం 5% తొలి(అప్‌ఫ్రంట్) డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దీనిలో భాగంగా అర్హతగల రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రతీ 15 యూనిట్లకు ఒక లాయల్టీ యూనిట్(6.66% డిస్కౌంట్) లభించనుంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్? వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు చెప్పారు. నిజానికి ఈ ఏడాది మార్చిలోగా కోల్ ఇండియాలో 10% వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ప్రతిపాదనను వాయిదా వేసింది. అంతేకాకుండా 5% వాటాను మాత్రమే డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కంపెనీలో 90% వాటా కలిగిన ప్రభుత్వం డివిడెండ్ రూపంలో రూ. 19,000 కోట్లను అందుకోవడం గమనార్హం.