Flipkart layoffs: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారంగా 5-7 శాతం వర్క్‌ఫోర్స్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది.
ఈ తొలగింపులు మార్చి-ఏప్రిల్ 2024 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒక సంవత్సరంపాటు నియామకాలను సైతం ఈ ఈ-కామర్స్ దిగ్గజం నిలిపేసింది. ఫ్లిప్‌కార్ట్ గత రెండేళ్లుగా పనితీరు ఆధారంగా ఏటా ఉద్యోగాలను తొలగిస్తూ వస్తోంది.
1500 మందిపై ప్రభావం
మింత్రా మినహా కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 22,000గా ఉంది. ప్రస్తుతం చేపట్టనున్న తొలగింపులు 1100-1500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయి. కాగా కంపెనీ పునర్నిర్మాణం, 2024కు సంబంధించిన రోడ్‌మ్యాప్ వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ఖరారవుతాయని నివేదిక సూచిస్తోంది.
ఇదే బాటాలో పేటీఎం, అమెజాన్, మీషో వంటి ఇతర సంస్థలు కూడా ఇటీవల వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ చర్యలు చేపట్టాయి. అదానీ గ్రూప్‌నకు 20 శాతం వాటా ఉన్న క్లియర్‌ట్రిప్‌తో సహకారాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ పరిశీలిస్తోంది. ఎయిర్‌లైన్ బుకింగ్‌లపై దృష్టి సారించే క్లియర్‌ట్రిప్‌నకు సంబంధించిన హోటల్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడి పెట్టే అవకావం ఉంది. వాల్‌మార్ట్, ఇతర సంస్థల నుంచి సమీకరిస్తున్న 1 బిలియన్ డాలర్ల నిధులు ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక ప్రణాళికలకు మద్దతు ఇస్తాయని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment