ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ తొలగింపు!.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్ | FM Sitharaman Addresses GST on Health Insurance Issue in Lok Sabha | Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ తొలగింపు!.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్

Published Thu, Aug 8 2024 8:51 AM | Last Updated on Thu, Aug 8 2024 10:47 AM

FM Sitharaman Addresses GST on Health Insurance Issue in Lok Sabha

లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ మీద 18 శాతం జీఎస్టీ తొలగించాలనే ఇండియా కూటమి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. జీఎస్‌టీ రాకముందు నుంచే మెడికల్ ఇన్సూరెన్స్ మీద టాక్స్ ఉండేది. ఇది కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇది ఉందని వెల్లడించారు.

ఇక్కడ నిరసన తెలుపుతున్నవారు తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగింపు గురించి చర్చించారా? వారు తమ తమ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు దాని గురించి లేఖలు వ్రాసి, రాష్ట్రాలకు 2/3 వంతు ఉన్న GST కౌన్సిల్‌లో దానిని పెంచాలని కోరారా? లేదు. కానీ ఇక్కడ మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి డ్రామా అని నిర్మలా సీతారామన్ అన్నారు.

జీవిత, వైద్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్‌టీను ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిని కోరుతూ నితిన్ గడ్కరీ మొదట లేఖ రాసారు. ఈ చర్య బీమా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించడమే కాకూండా.. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో కీలకమైన బీమా ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచుతుందని ఆయన అన్నారు.

నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్.. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి నాకు మెమోరాండం సమర్పించింది. యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య లైఫ్ అండ్ మెడికల్‌పై GST ఉపసంహరణకు సంబంధించినదని గడ్కరీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement