ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ రేజర్‌పేకు గట్టి షాక్ తగిలింది. సైబర్ నేరగాళ్లు రేజర్ పే కమ్యూనికేషన్స్‌ని హ్యాక్ చేసి భారీ మోసాలకు పాల్పడ్డారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏడు కోట్ల రూపాయలకు పైగా గుట్టు చప్పుడు కాకుండా కాజేశారు. ఆలస్యంగానైనా జరిగిన మోసం గమనించిన రేజర్‌పే వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రేజర్‌పే ట్రాన్సాక‌్షన్స్‌కి సంబంధించి 2022 మార్చి 6 నుంచి మే 13 వరకు 831 ఫెయిల్డ్ ట్రాన్సాక‌్షన్స్ విషయంలో పారదర్శకత లోపించిందంటూ రేజర్‌పేకి అధికారికంగా పేమెంట్ సర్వీసులు అందిస్తున్న ఫైసర్వ్ సంస్థ తెలిపింది. ఇందుకు సంంధించిన వివరాలు అందించింది.
వివరాలు అందుకున్న వెంటనే రేజర్‌పే అంతర్గత విచారణ జరగగా.. మోసం జరిగిన తీరు బట్టబయటైంది. గుర్తు తెలియని హ్యాకర్లు కమ్యూనికేషన్ వ్యవస్థను దారి మళ్లించి లావాదేవీల్లో నగదును తమ ఖాతాల్లోకి మరల్చుకున్నట్టు గుర్తించింది. ఈ తప్పుడు లావాదేవీల్లో జరుగుతున్న మోసాలను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. అప్పటికే కేటుగాల్లు రూ.7.38 కోట్లు కాజేశారు.
Comments
Please login to add a commentAdd a comment