Payment gateway
-
టెక్ దిగ్గజం కీలక ప్రకటన.. పేటీఎంకు గూగుల్ భారీ షాక్!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు గూగుల్ భారీ షాకిచ్చింది. త్వరలో భారత్‌లో మిలియన్ల మంది చిరు వ్యాపారులు ఆడియో అలర్ట్‌లతో క్యూఆర్ కోడ్ సాయంతో లావాదేవీలు జరిపేందుకు గాను స్పీకర్ సౌండ్ పాడ్స్(SoundPods)ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది దేశంలో పేటీఎం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర ఫిన్ టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పేటీఎం యూజర్లు ఇతర యూపీఐ పేమెంట్స్, చిరు వ్యాపారులు సౌండ్‌బాక్స్‌లను వినియోగిస్తున్నారు. తరుణంలో గూగుల్ గత ఏడాది తన సౌండ్‌బాక్స్‌లను పరిమిత యూజర్లకు అందించింది. బాక్స్ పనితీరు ఎలా ఉంది? లావా దేవీలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై వ్యాపారుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. గూగుల్ విడుదల చేసిన సౌండ్ బాక్స్ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సౌండ్ బాక్స్ లను వినియోగంలోకి తెస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇంగ్లీషుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీతో సహా ఆరు భారతీయ భాషలలో ఆడియో అలెర్ట్ లను అందించే గూగుల్ సౌండ్ పాడ్స్ కోసం వ్యాపారులు గూగుల్ ప్లే యాప్ ద్వారా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ రోజువారి లేదంటే,ఏడాది ప్లాన్ అనంతరం ఈ ఆడియో డివైజ్ పొందవచ్చు. రోజువారీ ప్లాన్‌లో, వ్యాపారులు వన్ టైమ్ సబ్ స్క్రిప్షన్ కింద రూ. 499 చెల్లించాలి. ఆ తర్వాత వారి సెటిల్మెంట్ ఖాతా నుండి నెలలో 25 రోజుల పాటు రోజుకు రూ.5 డిడక్ట్ అవుతుంది. ఏడాది ప్లాన్‌లో వ్యాపారి సెటిల్మెంట్ అకౌంట్ నుండి రూ.1,499 డిడక్ట్ అవుతుందని గూగుల్ తెలిపింది. గూగుల్ తన సొంత క్యూ ఆర్ కోడ్ల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఆడియో నోటిఫికేషన్ సేవలను పొందుతున్న వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. గూగుల్ పే క్యూఆర్ కోడ్ల ద్వారా నెలలో రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగిన తర్వాత రూ. 125 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చని గూగుల్ వెల్లడించింది. -
చైనా లోన్ యాప్స్:పేటీఎం, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీలకు ఈడీ షాక్!
బెంగళూరు: ఆన్లైన్ పేమెంట్ సంస్థలు రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ సంస్థలకు చైనీస్ లోన్ యాప్‌ల అక్రమ దందా సెగ చుట్టుకుంటోంది. కర్ణాటక రాజధాని నగరంలో ఆరు ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో చైనీయుల నియంత్రణలో ఉన్న ఈ సంస్థల ఖాతాల్లోని రూ. 17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. పేటీం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌కు చెందిన బెంగళూరులోని పలు ఆఫీసుల్లో దాడులు కొనసాగుతున్నాయని ఈడీ శనివారం తెలిపింది. ఇండియాకు చెందిన వారి నకిలీ ఐడీలతో, డమ్మీ డైరెక్టర్లుగా అవతరించి అనుమానిత, చట్టవిరుద్ధమైన ఆదాయాల్ని ఆర్జిస్తున్నారని ఈడీ ఆరోపించింది. మొబైల్ ద్వారా తక్కువ మొత్తంలో లోన్లు ఎరవేసి, ఆ తరువాత వారిని తీవ్రంగా వేధించడం లాంటి వాటికి సంబంధించి అనేక సంస్థలు/వ్యక్తులపై బెంగళూరు పోలీస్ సైబర్ క్రైమ్ స్టేషన్ దాఖలు చేసిన 18 ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీలాండరింగ్ కేసును రూపొందించినట్లుఈడీ తెలిపింది. కాగా పేటీఎం, రేజర్‌పే సహా దేశంలోని పలు పేమెంట్ గేట్‌వే కంపెనీలపై ఈడీ ఇప్పటికే నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన పలు లోన్ల యాప్స్ పేమెంట్స్ చేసేందుకు వీటిని వాడుకుంటున్నట్లు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో ఇటీవలి తేలింది. దీంతో ఈ ఆయా కంపెనీలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. -
ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్తో జాగ్రత్త !
ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ రేజర్‌పేకు గట్టి షాక్ తగిలింది. సైబర్ నేరగాళ్లు రేజర్ పే కమ్యూనికేషన్స్‌ని హ్యాక్ చేసి భారీ మోసాలకు పాల్పడ్డారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏడు కోట్ల రూపాయలకు పైగా గుట్టు చప్పుడు కాకుండా కాజేశారు. ఆలస్యంగానైనా జరిగిన మోసం గమనించిన రేజర్‌పే వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేజర్‌పే ట్రాన్సాక్షన్స్కి సంబంధించి 2022 మార్చి 6 నుంచి మే 13 వరకు 831 ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో పారదర్శకత లోపించిందంటూ రేజర్‌పేకి అధికారికంగా పేమెంట్ సర్వీసులు అందిస్తున్న ఫైసర్వ్ సంస్థ తెలిపింది. ఇందుకు సంంధించిన వివరాలు అందించింది. వివరాలు అందుకున్న వెంటనే రేజర్‌పే అంతర్గత విచారణ జరగగా.. మోసం జరిగిన తీరు బట్టబయటైంది. గుర్తు తెలియని హ్యాకర్లు కమ్యూనికేషన్ వ్యవస్థను దారి మళ్లించి లావాదేవీల్లో నగదును తమ ఖాతాల్లోకి మరల్చుకున్నట్టు గుర్తించింది. ఈ తప్పుడు లావాదేవీల్లో జరుగుతున్న మోసాలను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. అప్పటికే కేటుగాల్లు రూ.7.38 కోట్లు కాజేశారు. -
ఆన్లైన్లో ‘పాఠాలు’ నేర్చుకుని.. డబ్బులు కొట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: పేజీ సంస్థకు చెందిన సర్వర్‌ను హ్యాక్ చేసిన దినేష్ దాని పూల్ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు కాజేయడంతో విషయం పోలీసుల వరకు వచ్చి చిక్కాడు. అదే ఓ హ్యాకర్ ఏదైనా పేమెంట్ గేట్‌వే సంస్థ లేదా ప్రైవేట్ బ్యాంక్ సర్వర్‌ను టార్గెట్ చేసి, దాని కస్టమర్ల ఖాతాల నుంచి రూ.10 చొప్పున కాజేస్తే అసలు బయటకే రాదు. సునామీ ఎటాక్స్‌గా పిలిచే ఈ తరహా సైబర్ దాడులు ఇటీవల పెరిగిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హ్యాకర్లలో ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని, ఆన్లైన్లో ‘పాఠాలు’ నేర్చుకుని, డార్క్‌వెబ్‌లో సాఫ్ట్వేర్లు ఖరీదు చేసి తమ పని పూర్తి చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆందోళన కలిగించే ఈ అంశంపై దృష్టి పెట్టి సైబర్ నిఘా ముమ్మరం చేశామని పేర్కొంటున్నారు. ఎప్పుడూ పెద్ద మొత్తాల జోలికి పోరు.. సర్వర్లోకి ప్రవేశించే హ్యాకర్లు ఆయా సంస్థల పూల్ ఖాతాలకు యాక్సెస్ చేస్తారు. అక్కడ నుంచి ఒకేసారి పెద్ద మొత్తాలు కాజేస్తే విషయం కేసుల వరకు వెళ్లి వీళ్లు చిక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హ్యాకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద మొత్తాల జోలికి వెళ్లట్లేదు. ప్రధానంగా ఆయా సంస్థల వినియోగదారుల ఖాతాలను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో ఖాతా నుంచి, ఒక్కో దఫా కనిష్టంగా రూ.1 గరిష్టంగా రూ.5 మాత్రమే కాజేస్తారు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాల్లోనివి తాము తెరిచిన వర్చువల్ ఖాతాల్లోకి మళ్లించి బిట్‌కాయిన్స్‌గా మార్చేస్తారు. గమనించినా ఫిర్యాదు చేయరనే... ఖాతాదారుల నగదు కాజేస్తున్న హ్యాకర్లు ఆ లావాదేవీకి సంబంధించిన అలెర్ట్ కూడా వారికి వెళ్లకుండా సర్వర్లోనే మ్యానేజ్ చేస్తున్నారు. ఫలితంగా తన ఖాతా నుంచి ఈ మొత్తం పోయిందనే విషయం కస్టమర్లు గుర్తించలేరు. రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు.. ఇలా రౌండ్ ఫిగర్ నగదు ఉన్న వాటి ఖాతాల జోలికి హ్యాకర్లు వెళ్లరు. అయినప్పటికీ వినియోగదారుడు నగదు పోయినట్లు గుర్తించినా చిన్నమొత్తం కావడంతో ఫిర్యాదు వరకు వెళ్లరు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాలను టార్గెట్ చేస్తున్న హ్యాకర్‌కి చేరే మొత్తం మాత్రం భారీగానే ఉంటుంది. తన చేతిలో ఉన్న డబ్బు ఖర్చయ్యే వరకు లేదా విషయం ఖాతాదారుడు మర్చిపోతాడని భావించే కాలం వరకు ఈ సునామీ ఎటాక్ చేసిన హ్యాకర్ మరో ప్రయత్నం చేయరు. ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా.. నగరానికి చెందిన అనేక మంది ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులు హ్యాకర్లుగా మారారు. వివిధ రకాలైన యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ అంశాల ఆధారంగా హ్యాకింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఇది చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను డార్క్‌వెబ్‌లో ఖరీదు చేస్తున్నారు. టార్గెట్ చేసిన సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేయడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ఐపీలను వాడుతున్నారు. వీటి ఆధారంగా ఆ సంస్థ సర్వర్లోకి ప్రవేశిస్తున్నారు. వాటి ఫైర్ వాల్స్ బలహీనంగా ఉండటం, సైబర్ సెక్యూరిటీలో లోపాలు వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు వివరిస్తున్నారు. (క్లిక్: మ్యాట్రిమొనిలో ఎన్నారై పేరుతో మోసం! చివరకు..) బిల్లుల చెల్లింపులోనూ గోల్మాల్... ఈ సునామీ ఎటాక్స్ చేసే హ్యాకర్లు ‘బిల్లు చెల్లింపు’లోనూ గోల్‌మాల్స్ చేస్తుంటారు. వివిధ పోస్టు పెయిడ్ సేవలు పొందే పరియస్తులైన కస్టమర్ల కోసమే కమీషన్లు తీసుకుని ఈ పని చేస్తుంటారు. బ్రాండ్ బ్యాండ్ సహా వివిధ సేవలకు అందించే సంస్థలు తమ ఖాతాదారుడికి ప్రతి నెలా బిల్లు పంపిస్తుంటాయి. దీని చెల్లింపులు అతడు ఆన్లైన్లో చేస్తుంటాడు. రూ.10 వేల బిల్లు ఉంటే రూ.1000 తీసుకుని ‘మాఫీ’ చేయడం హ్యాకర్ పని. వినియోగదారుడి నుంచి ఈ మొత్తం కమీషన్‌గా తీసుకునే సునామీ హ్యాకర్ ఆ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి, బిల్లు మొత్తం క్లియర్ అయినట్లు సున్నాగా మార్చేస్తుంటాడు. ఇది కేవలం పరిచయస్తులైన వారితో కుమ్మక్కై చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. హ్యాకింగ్ విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించలేకపోతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్: హైఫై ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ పనుల్లో మరో ప్రత్యేకత!) -
దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి ఏదైనా నేరం చేసి జైలుకు వెళితే అతడి చేతిలో ఉన్న ఉద్యోగం, ఇతర అవకాశాలు కోల్పోతాడు. అయితే నగరానికి చెందిన ‘పేమెంట్ గేట్ వే’ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి భారీ మొత్తం కాజేసిన కేసులో చిక్కిన వన్నం శ్రీరామ్ దినేష్ కుమార్ కథ వేరేలా ఉంది. ఈ హ్యాకర్‌ను తాము ఎథికల్ హ్యాకర్‌గా వినియోగించుకుంటామని బాధిత కంపెనీనే ముందుకు వచ్చింది. నగర పోలీసు అధికారులు సైతం ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు. దినేష్‌ను అరెస్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అతడికి హ్యాకింగ్‌పై ఉన్న పట్టు, ప్రస్తుత అవసరాలను గమనించి మార్పు వచ్చేలా కౌన్సిలింగ్ చేశారు. ఫలితంగా ఎథికల్ హ్యాకర్‌గా మారడానికి దినేష్ అంగీకరించాడు. పరిస్థితులు వివరిస్తూ దినేష్‌కు కౌన్సిలింగ్... నగరానికి చెందిన పేమెంట్ గేట్ వే సంస్థ పేజీ సర్వర్‌ను గతేడాది నవంబర్ నుంచి రెండుసార్లు హ్యాకర్లు దాడి చేశారు. ఈ ఏడాది మార్చిలో దినేష్ చేసిన తాజా ఎటాక్ రెండోది. దీంతో అప్రమత్తమైన ఆ సంస్థ తమ సైబర్ సెక్యూరిటీ, ఫైర్‌వాల్స్ పటిష్టం చేయడానికి కొన్ని సంస్థల సేవలతో ఒప్పందాలు చేసుకుంది. వీరి సర్వర్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ను అధ్యయనం చేసిన ఆయా సంస్థలు కొన్ని మార్పు చేర్పులు చేయడంతో ఇక భవిష్యత్తులో ఇలాంటి హ్యాకింగ్ ఉండవని భావించింది. అయిన్పప్పటికీ వాటిన్ని ఛేదించిన దినేష్ హ్యాకింగ్ చేశాడు. ఇతడిని అరెస్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు విద్యార్హతలు లేకున్నా అతడికి హ్యాకింగ్, వల్నరబులిటీ టెస్టుల్లో ప్రావీణ్యాన్ని గుర్తించారు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిభను సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అతడిలో వచ్చిన పశ్చాత్తాపం, మార్పులను దర్యాప్తు అధికారులు గుర్తించారు. చదవండి: Hyderabad: గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7 వారికి తెలియని లోపాలు బయటపెట్టడంతో.. ఈ నేపథ్యంలోనే అతడి ద్వారానే బాధిత సంస్థలో ఉన్న సాంకేతిక లోపాలను వారికి తెలియజేయాలని నిర్ణయించారు. దీంతో అతడిని విచారిస్తున్న సందర్భంలో పేజీ సంస్థ సాంకేతిక బృందాన్నీ సైబర్ ఠాణాకు పిలిచారు. వారి సమక్షంలోనే దినేష్ ఇప్పటికీ దాని సర్వర్, సాఫ్ట్‌వేర్‌లో ఉన్న అనేక లోపాలను బయటపెట్టాడు. దీంతో కంగుతిన్న ఆ సంస్థ ఎథికల్ హ్యాకర్‌గా మారి తమ సర్వర్‌ను హ్యాకింగ్ ఫ్రూఫ్‌గా మార్చడానికి సహకరిస్తావా? అంటూ దినేష్‌ను కోరారు. అప్పటికే కౌన్సిలింగ్‌తో మారిన దినేష్ వెంటనే అంగీకరించాడు. మరోపక్క ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో నగర పోలీసులు సైతం ప్రైవేట్ నిపుణులు, ఎథికల్ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. దినేష్ శైలిని గమనించిన ఓ ఉన్నతాధికారి ఇతడు ఆ నిపుణులకు ఏమాత్రం తక్కువ కాదని గుర్తించారు. దీంతో దినేష్ జైలు నుంచి విడుదలైన తర్వాత భారీ సైబర్ నేరాల దర్యాప్తులో అతడి సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. దినేష్ ఈ పనులు ప్రారంభిస్తే మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అనునిత్యం అతడి కార్యకలాపాలు, వ్యవహారశైలిపై నిఘా ఉంచనున్నామని తెలిపారు. కుటుంబ నేపథ్యమూ కారణమే... దినేష్‌ను ఎథికల్ హ్యాకర్‌గా మార్చాలని సైబర్ క్రైమ్ పోలీసులు యోచించడానికి అతడి ప్రతిభతో పాటు కుటుంబ నేపథ్యమూ ఓ కారణమే. ఇతడి తండ్రి ఆర్టీసీ కండెక్టర్ కాగా, తల్లిది చిన్న స్థాయి రాజకీయ నేపథ్యం. దినేష్ భార్య ఏపీలోని గ్రామ సచివాలయంలో వ్యవసాయాధికారిణిగా పని చేస్తున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ విద్యార్హతలు లేక ఉద్యోగాలు రాకపోవడం, పెట్టిన ప్రాజెక్టులు నష్టాలు మిగల్చడంతోనే దినేష్ నేరబాటపట్టినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. -
రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్.. ‘వన్ ప్లస్’తో చిక్కాడు!
సాక్షి, హైదరాబాద్: పేమెంట్ గేట్వేలను టార్గెట్‌గా చేసుకుని రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్ వి.శ్రీరాం దినేష్ కుమార్‌ను ఓ పేమెంట్ గేట్‌వేలో లభించిన చిన్న క్లూ ఆధారంగా పట్టుకున్నారు. ఎక్కడా తన ఉనికి బయటపడకుండా పక్కా పథకం ప్రకారం నేరాలు చేసిన ఇతగాడు చిక్కడానికి సెకండ్ హ్యాండ్ వన్ ప్లస్ ఫోన్ కారణమైంది. నగరానికి చెందిన పేజీ పేమెంట్ గేట్‌వే సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.52.9 లక్షలు కాజేసిన దినేష్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఏపీలోని పెడనకు చెందిన దినేష్ విజయవాడలో వెబ్ డిజైనింగ్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. లాక్డౌన్ కారణంగా నష్టాలు రావడంతో దీన్ని మూసేశాడు. అప్పటికే ఇతగాడికి పేమెంట్ గేట్‌వేలకు సంబంధించిన సాఫ్ట్వేర్ వల్నరబులిటీ టెస్ట్‌లపై పట్టు ఉండటంతో వాటినే టార్గెట్‌గా చేసుకున్నాడు. పేజీ సంస్థ నుంచి నగదు కొల్లగొట్టడానికి పథకం వేసిన ఇతడికి స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్ అయిన చింటు సహకరించాడు. వాట్సాప్‌లోని కొన్ని ‘నేరగాళ్ల గ్రూపుల్లో’ఔ దినేష్ సభ్యుడిగా ఉన్నాడు. వాటిలో ఉన్న వారి ద్వారానే జార్ఖండ్‌లోని జామ్‌తార చిరునామా, సోమ్‌నాథ్ పేరుతో ఉన్న గుర్తింపు పత్రాలు సంపాదించాడు. వీటిని వినియోగించే చెన్నైలోని ఈక్విటాస్ బ్యాంక్‌లో హైప్రోక్స్టెక్, ఇన్వెంట్ఫైల్ సంస్థల పేర్లతో వర్చువల్ ఖాతాలు తెరిచాడు. బెంగళూరులో ఎస్ బ్యాంక్ శాఖను వర్చుల్‌గా సంప్రదించి తను తయారు చేసిన మూడు యాప్‌ల ఆధారంగా ఏఎన్సార్ ఎంటర్ప్రైజెస్ పేరుతో వారి పూల్ ఖాతాకు యాక్సస్ పొందాడు. వీటికి లింక్ చేసిన ఫోన్ నంబర్ల సిమ్‌కార్డులను చింటు తప్పుడు పేర్లతో ఉత్తరాదిలోని ప్రాంతాల నుంచి తెప్పించాడు. పేజీ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసిన దినేష్ దాని పూల్ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు రెండు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు. వాటి నుంచి యస్ బ్యాంక్‌లోని పూల్ ఖాతాలోకి బదిలీ చేశాడు. ఈ ఖాతా నుంచి బోగస్ వివరాలతో తెరిచిన బిట్‌కాయిన్ వాలెట్‌లోకి, దాని నుంచి మరో బిట్‌కాయిన్ సైట్‌లోని తన సొంత వాలెట్‌లోకి మళ్లించాడు. అక్కడి నుంచి నగదుగా మార్చి తనతో పాటు సన్నిహితులకు చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని ట్రాన్స్ఫర్ చేసి డ్రా చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఎథికల్ హ్యాకర్ల సహకారం తీసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నేరం జరిగిన తీరు గుర్తించారు. అయితే జామ్‌తార సైతం సైబర్ నేరగాళ్ల అడ్డా కావడంతో సోమ్నాథే నిందితుడిగా భావించారు. కొన్ని రోజులు అతడి కోసం గాలించినా ఫలితం లేదు. బోగస్ వివరాలతో సిమ్‌కార్డులు కొనే దినేష్ వాటిని వాడటానికి కొత్త ఫోన్లు ఖరీదు చేయడు. పోలీసులకు చిక్కకూడదనే సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవాడు. ఇదే తరహాలో విజయవాడకు చెందిన వ్యక్తి నుంచి వన్ ప్లస్ కంపెనీ ఫోన్‌ను రూ.16 వేలకు కొనుగోలు చేశాడు. అతడికి రూ.15 వేలు నగదు ఇచ్చి తాను వాడే ఓ బోగస్ నంబరే ఇచ్చాడు. తనకు రావాల్సిన రూ.వెయ్యి కోసం ఇతడు ఒత్తిడి చేయడంతో దినేష్ రూ.1000 పేటీఎం ద్వారా పంపాడు. తన వద్ద ఉన్న సిమ్‌కార్డును ఫోన్లో వేసి నేరంలో వాడాడు. ఫోన్ ఐఎంఈఐ నంబర్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు విజయవాడ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి వద్ద కూడా దినేష్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే తనకు రూ.1000 బదిలీ అయిన పేటీఎం నంబర్ ఇచ్చాడు. దీని ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు దినేష్‌ను పట్టుకోగలిగారు. పేజీ సంస్థలో దినేష్ చేసింది రెండో హ్యాకింగ్‌గా పోలీసులు చెబుతున్నారు. మొదటిసారిగా గతేడాది నవంబర్‌లో దీన్ని సర్వర్‌ను హ్యాక్ చేసి కొందరు హ్యాకర్లు రూ.1.28 కోట్లు కొల్లగొట్టారు. అప్పట్లో ఈ నగదు వెళ్లిన ఆరు ఖాతాలు ఒడిస్సా, వెస్ట్ బెంగాల్‌లకు చెందినవిగా తేలింది. అవన్నీ బోగస్ వివరాలతో తెరిచినవి కావడంతో ఆధారాలు దొరక్క కేసు ముందుకు వెళ్లలేదు. -
నెట్‌ఫ్లిక్స్ మరో ఆప్షన్.. పేమెంట్స్ ఇప్పుడు మరింత ఈజీ
Netflix UPI Payment: కస్టమర్లకు మరింత సుళువుగా మెరుగైన సేవలు అందివ్వడంలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ పేమెంట్ ఆప్షన్స్‌ని సరళతరం చేసింది. తేలికగా, వేగంగా అకౌంట్ రెన్యువల్ చేసుకునేలా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. 50 లక్షల మంది చందాదారులు ఓవర్ ది టాప్ ఆధారంగా వీడియో కంటెంట్ అందించే నెట్‌ఫ్లిక్స్‌కి ఇండియాలో యాభై లక్షల మందికి పైగా చందాదారులు ఉన్నారు. వివిధ వర్గాల అవసరాలకు తగ్గట్టుగా పలు రకాల ప్లాన్స్‌ని నెట్‌ఫ్లిక్స్ అమలు చేస్తోంది. కనిష్టంగా నెలకు రూ. 200ల నుంచి గరిష్టంగా రూ. 799 వరకు వివిధ రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి,. అయితే కొత్త చందాదారులతో పాటు పాత సబ్స్క్రైబర్లు తమ ఖాతాను రెన్యువల్ చేసుకోవాలంటే క్రెడిట్, డెబిట్ కార్డుల ఆధారంగానే చేసుకోవాల్సి వచ్చేది. ఇటీవలే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా పేమెంట్ ఆప్షన్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ పేమెంట్స్ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి యూపీఐ పేమెంట్స్ పెరిగిపోయాయి. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యాప్‌లను ఉపయోగించి రోజువారి లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సంఖ్య పెరిగింది. టీ కొట్టు, పాన్ షాప్‌ల నుంచి బడా మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్ సాధారణ విషయంగా మారింది. అయితే నెట్‌ఫ్లిక్స్ మాత్రం యూపీఐ పేమెంట్స్‌కి ఇంతకాలం అవకాశం లేదు. తాజాగా యూపీఐ పేమెంట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. యాక్టివేట్ చేసుకోండిలా నెట్‌ఫ్లిక్స్ పేమెంట్స్‌ని యూపీఐ ద్వారా చేయాలంటే నెట్‌ఫ్లిక్స్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. - నెట్‌ఫ్లిక్స్ ఇండియా వెబ్‌పోర్టల్ లేదా యాప్‌ని ఓపెన్ చేసి అకౌంట్ సెక్షన్లోకి వెళ్లాలి - మేనేజ్ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి - చేంజ్ ది పేమెంట్ మెథడ్‌ని ఎంచుకోవాలి - అక్కడ యూపీఐ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. చదవండి : ఈ మొబైల్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హట్‌స్టార్ ఉచితం..! -
ఐఆర్సీటీసీ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లావాదేవీలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో ఇప్పటికే ఐఆర్సీటీసీ ఈ వాలెట్‌ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా థర్డ్ పార్టీ పేమెంట్ సంస్థలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తద్వారా ప్రస్తుతం నెలకు 1.2మిలియన్లకు పైగా టికెట్లను విక్రయిస్తున్నసంస్థ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆదాయంతోపాటు భారీ లావాదేవీల ద్వారా అధిక మొత్తంలో వచ్చే తక్షణ ఆదాయాలపై ఐఆర్సీటీసీ కన్నేసింది. ఈ నేపథ్యంలోనే సొంత పేమెంట్ గేట్‌వేను ప్రారంభించనుంది. తద్వారా థర్ట్ పార్టీ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ప్రాథమికంగా ఈ పేమెంట్ గేట్‌వేకు ‘ఐపే’గా పిలుస్తోందట. రాబోయే 4-8 వారాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించనుంది. పరీక్ష విజయవంతమైన అనంతరం దీన్ని దశలవారీగా అన్ని ప్లాట్‌ఫాంలలోనూ అమల్లోకి తీసుకురానుంది. తద్వారా ప్రస్తుతం రేజర్, మొబీక్విక్, పేటిఎం లాంటి సంస్థకు గట్టి షాక్ ఇవ్వనుంది. ఈ సంస్థలకు గేట్‌వేల ద్వారా రైల్వే టికెట్ బుకింగ్ లావాదేవీలకు భారీగా గండిపడనుంది. కాగా ఐఆర్సీటీసీ 2016-2017 వార్షిక నివేదిక ప్రకారం 573,000 ఇ-టికెట్లను రోజువారీ విక్రయిస్తోంది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు పేటీఎం, రేజర్ రెండూ నిరాకరించాయి. అటు సొంత పేమెంట్ గేట్‌వే ఆవిష్కరణపై ఐఆర్సీటీసీ అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది. -
పలు డెబిట్ కార్డులను బ్లాక్ చేసిన ఐఆర్సీటీసీ
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) డెబిట్ కార్డు వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కొన్ని బ్యాంకుల డెబిట్ కార్డుల పేమెంట్ గేట్‌వేను బ్లాక్ చేసింది. కన్వీనియన్స్ ఫీజు కారణంగా పలు బ్యాంకుల డెబిట్‌కార్డు లావాదేవీలను నిలిపివేసింది. ప్రస్తుతానికి ఆరు బ్యాంకులు తప్ప మిగిలిన అనేక బ్యాంకులకు చెందిన కార్డు వినియోగదారులకు అసౌకర్యం కలగనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా ఆరు బ్యాంకుల కార్డుదారుల కార్డు చెల్లింపులను మాత్రమే అనుమతిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత కస్టమర్లనుంచి వసూలు చేసే రూ.20 ఫీజును రద్దు చేసింది. అయితే ఈ ఫీజులో బ్యాంకుల వంతుగా చెల్లించాల్సిన (సగం)సొమ్మును ఆయా బ్యాంకులు చెల్లించకపోవడంతో ఐఆర్సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు దీనిపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ), ఐఆర్సీటీసీ, ఇండియన్ రైల్వేశాఖతో చర్చించనున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. -
రూపే కార్డ్ ఆవిష్కరణ
- ప్రపంచంలో ఏడవ పేమెంట్ గేట్‌వే - రైల్వే టికెట్లకు ప్రి పెయిడ్ వేరియంట్ న్యూఢిల్లీ: భారత దేశం తన సొంత చెల్లింపుల గేట్‌వే, రూపేను గురువారం ఆవిష్కరించింది. వీసా, మాస్టర్ కార్డ్‌ల మాదిరి ఈ రూపే కార్డ్ కూడా ఏటీఎంల్లో, మర్చంట్ అవుట్లెట్లలో పనిచేస్తుంది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఈ కార్డ్‌ను ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ రూపే ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసింది. ఈ రూపే ప్లాట్‌ఫామ్ ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకా ఇతర బ్యాంకుల్లో క్లియరింగ్, సెటిల్మెంట్ లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఆన్లైన్ విక్రయాల్లో ఈ రూపే కార్డ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రపంచంలో ఏడో చెల్లింపు విధానం. త్వరలో ఐఆర్‌సీటీ రూపే కార్డ్‌లో ప్రి పెయిడ్ వేరియంట్‌ను అందించనున్నది. రైల్వే టికెట్ల బుకింగ్‌లో ఈ ప్రి పెయిడ్ వేరియంట్ ఉపయోగపడుతుంది. ఈ రూపే కార్డ్‌ను విదేశాలకు కూడా తీసుకెళ్లేందుకు వీలుగా అమెరికాలోని డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జపాన్‌లోని జేడీసీలతో చర్చలు జరుపుతున్నామని ఎన్పీసీఐ చైర్మన్ బాలచంద్రన్. ఎం. చెప్పారు. వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ కార్డ్‌లతో పోల్చితే తక్కువ వ్యయానికే ఈ రూపే కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆర్థిక సేవల కార్యదర్శి జి. ఎస్. సంధు చెప్పారు.