న్యూఢిల్లీ: రసాయనాలు, కంటైనర్లు, కీలక ముడివస్తువులకు సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని శక్తులు కుమ్మక్కై అనిశ్చితిని సృష్టిస్తున్నాయని కెవిన్‌కేర్ సీఎండీ సీకే రంగనాథన్ వ్యాఖ్యానించారు. తద్వారా మరింత ఎక్కువ ధరలు చెల్లించేలా కస్టమర్లను బలవంతపెడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో దేశీయంగానే కుమ్మక్కయ్యే వారని ప్రస్తుతం ఇది సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోందని ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రంగనాథన్ చెప్పారు.
‘ఇప్పటివరకూ క్రూడ్ విషయంలోనే ఇలాంటివి కనిపించేవి. కొన్ని దేశాలు కుమ్మక్కయ్యేవి. కానీ ఇప్పుడు అధిక పెట్టుబడులు అవసరమయ్యే కంటైనర్లు, రసాయనాలు లేదా ఇతరత్రా ఏవైనా కీలక ముడి పదార్థాలను ప్రపంచంలో కేవలం కొంతమందే తయారు చేస్తున్నారు. వారంతా కుమ్మక్కవుతున్నారు. దీనితో పేద కస్టమర్లు భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది‘ అని పేర్కొన్నారు. మరోవైపు, డిజిటైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటి కారణంగా రాబోయే రోజుల్లో వ్యాపారాల ఫండమెంటల్స్‌లో గణనీయంగా మార్పులు రాబోతున్నాయని రంగనాథన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment