గత కొన్ని రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న స్వల్ప తగ్గుదలను నమోదు చేసి.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై & ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా పసిడి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 58550, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 63870గా ఉంది.
చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం రేటు రూ. 5910, 24 క్యారెట్ల ఒక గ్రామ్ పసిడి విలువ రూ. 6447గా ఉంది. దీని ప్రకారం తులం బంగారం ధర వరుసగా రూ. 59100, రూ. 64470గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 5870 (22 క్యారెట్స్ ఒక గ్రామ్), రూ. 6397 (24 క్యారెట్ ఒక గ్రామ్)గా ఉంది. అంటే నిన్న ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: సందడి చేయడానికి సిద్ధంగా ఉండండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
వెండి ధరలు
నిన్న ఒకేసారి రూ. 1200 తగ్గిన వెండి ధర ఈ రోజు మళ్ళీ రూ. 300 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ఒక కేజీ వెండి ధర మళ్ళీ రూ. 80000 దాటేసింది. రానున్న పండుగ సీజన్ల దృష్ట్యా ఈ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment