ఆరు రోజుల తర్వాత ‘స్వర్ణోత్సాహం’! | Today Gold And Silver Prices August 14th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: ఆరు రోజుల తర్వాత ‘స్వర్ణోత్సాహం’!

Published Wed, Aug 14 2024 3:03 PM | Last Updated on Wed, Aug 14 2024 5:00 PM

Gold and Silver Price Today 14 August 2024

వరుసగా పెరుగుతున్న ధరలతో దిగాలుపడ్డ పసిడి ప్రియులకు కాస్తంత ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 14) స్వల్పంగా తగ్గాయి. దాదాపు ఆరు రోజుల తర్వాత పసిడి ధరల్లో తగ్గుదల కనిపించడం కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.65,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 కరిగి రూ. 71,510 లకు తగ్గింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.100 తక్కువై  రూ.65,700 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 110 తగ్గి రూ.71,660 లకు దిగివచ్చింది. అలాగే చెన్నై విషయానికి వస్తే  22 క్యారెట్ల బంగారం రూ.100 తరిగి రూ.65,550 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.71,510 వద్దకు చేరింది.

వెండి ధరలు..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగివచ్చాయి. హైదరాబాద్‌లో బుధవారం వెండి రేటు కేజీకి రూ.500 తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.88,000 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement