దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 16) స్వల్పంగా పెరిగాయి. తెలుగువారికి ముఖ్యమైన వరలక్ష్మి వ్రతం రోజున పసిడి ధరలు పెరగడం కొనుగోలుదారులకు కాస్తంత నిరాశను కలిగించింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.100 పెరిగి రూ.65,650 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగి రూ. 71,620 లకు ఎగిసింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.100 ఎగిసి రూ.65,800 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరిగి రూ.71,770 లకు చేరింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.65,650 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 పుంజుకుని రూ.71,620 వద్దకు చేరింది.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు శుక్రవారం వెండి రేటు కేజీకి రూ.500 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.89,000 లను తాకింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment