బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే.. | Gold and Silver Price Today 18 September 2024 | Sakshi
Sakshi News home page

బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..

Published Wed, Sep 18 2024 2:58 PM | Last Updated on Wed, Sep 18 2024 3:10 PM

Gold and Silver Price Today 18 September 2024

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్‌ 18) పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,500 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.160 కరిగి  రూ. 74,730 వద్దకు తగ్గింది.

దేశంలోని ఇతర ప్రాంతాల విషయానికి వస్తే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగురాష్ట్రాలలో మాదిరిగానే బంగారం ధరలు తగ్గి అవే రేట్లు ఉన్నాయి. ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,650 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 క్షీణించి రూ.74,880 వద్ద​కు వచ్చింది.

ఇదీ చదవండి: చేతిలోని క్యాష్‌.. ఈజీగా అకౌంట్‌లోకి..

వెండి ధరలు కూడా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి ధర ఈరోజు కూడా రూ.1000 క్షీణించింది. హైదరాబాద్‌లో వెండి ధర కేజీ రూ.96,000 వద్దకు దిగొచ్చింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement