
వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీలలో కూడా పసిడి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.
విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నైలలో ఈ రోజు తులం బంగారం ధర రూ.300 (22 క్యారెట్స్) నుంచి రూ.330 (24 క్యారెట్స్) వరకు పెరిగింది. నిన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57700 కాగా.. చెన్నై, ఢిల్లీలలో వరుసగా రూ. 58100, రూ. 57850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధరలు వరుసగా రూ. 62950, రూ. 63380, రూ. 63100 వద్ద ఉన్నాయి.
ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..!
బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా రూ. 200 పెరిగింది. మూడు రోజుల తరువాత వెండి ధరలు స్వల్పంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.