దేశంలో బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. దేశవ్యాప్తంగా క్రితం రోజున పెరుగుదల నమోదు చేసిన పసిడి ధరలు నేడు (ఆగస్టు 25) స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,040 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,190 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఈరోజు ఎలాంటి కదలికా లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.93,000 వద్ద నిలకడగా ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment