బంగారం ధరల్లో కదలిక | Today Gold And Silver Prices August 28th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం ధరల్లో కదలిక

Published Wed, Aug 28 2024 3:32 PM | Last Updated on Thu, Aug 29 2024 11:57 AM

Gold and Silver Price Today 28 August 2024

దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులను నిరాశపరిచాయి. మూడు రోజుల అనంతరం మళ్లీ ఎగిశాయి. క్రితం రోజున స్వల్పంగా తగ్గినట్టే తగ్గి నేడు (ఆగస్టు 28) మోస్తరుగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పసిడి ధరలు ఎంత మేర పెరిగాయో ఇక్కడ తెలుసుకుందాం..

విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ నగరాలతో సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.210 పెరిగి రూ.67,150 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.220 ఎగిసి రూ. 73,250 వద్దకు పెరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో  ధరలు పెరిగాయి.

అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.67,300 వద్దకు హెచ్చింది.  అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.73,340 వద్దకు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.93,500 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement