దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన తగ్గి పసిడి రేట్లు నేడు (ఆగస్టు 29) స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.67,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,250 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు స్థిరంగా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు నిడకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,300, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,400 లుగా ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో గురువారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.93,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment