బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. దేశవ్యాప్తంగా పసిడి రేట్లు నేడు (ఆగస్టు 31) స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజున కూడా బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. పుత్తడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.100 తగ్గి రూ.66,950 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 క్షీణించి రూ. 73,040 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి.
ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,100, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 110 తరిగి రూ.73,190 లుగా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ శనివారం భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1000 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,000 వద్దకు వచ్చింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment