
బంగారం ధరలు కొనుగోలుదారులకు ఆశాజనకంగా కొనసాగున్నాయి. వారం రోజులుగా దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించలేదు. ఈరోజు (సెప్టెంబర్ 4) కూడా పుత్తడి రేట్లు స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా గడిచిన వారం రోజుల్లో కొద్దికొద్దిగానే తులానికి రూ.500 మేర తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.10 తగ్గి రూ.66,690 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.10 క్షీణించి రూ. 72,760 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు క్షీణించాయి.
ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.66,840 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 తరిగి రూ.72,910 వద్ద కొనసాగుతున్నాయి.
వెండి సైతం
వెండి ధరలు గత ఎనిమిది రోజులుగా సానుకూలంగా కొనసాగుతన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం కూడా భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో నేడే కిలో వెండి రూ.900 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.90,000 వద్దకు దిగివచ్చింది. మొత్తంగా గడిచిన ఎనిమిది రోజుల్లో ఎటువంటి పెరుగుదల లేకుండా కేజీకి రూ.3,500 మేర వెండి ధరలు క్షీణించాయి.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)